Saturday, September 13, 2025 03:21 AM
Saturday, September 13, 2025 03:21 AM
roots

ఆ నియోజకవర్గంలో ఆధిపత్య పోరుకి బాబు చెక్‌ పెడతారా…?

ఏపీలో తెలుగుదేశం పార్టీకి కంట్లో నలకలా మారిన నియోజకవర్గం ఏదీ అంటే… ఠక్కున చెప్పే పేరు యర్రగొండపాలెం. వైసీపీ నేతలు మరో పులివెందుల అని గొప్పగా చెప్పుకుంటారు. 2009లో నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు వరుసగా నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గెలవగా… 2014లో వైసీపీ అభ్యర్థిగా పాలపర్తి డేవిడ్‌ రాజ్‌ గెలిచారు. ఇక 2019లో మరోసారి ఆదిమూలపు సురేష్‌ విజయం సాధించారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్‌ బాబు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ… తాటిపర్తి చంద్రశేఖర్‌ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Also Read : టిడిపిలో తీగల చేరిక ముహుర్తం ఖరారు…!

వరుసగా నాలుగు సార్లు నియోజకవర్గంలో టీడీపీ ఓటమికి కేవలం ఆధిపత్య పోరు మాత్రమే కారణమనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 2004 వరకు మార్కాపురం నియోజకవర్గంలో భాగంగా ఉండగా… పునర్విభజనలో 5 మండలాలతో కలిపి యర్రగొండపాలెం కేంద్రంగా ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేశారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వ్‌డుగా ప్రకటించారు. నాటి నుంచి వరుసగా నాలుగు సార్లు కూడా టీడీపీ అభ్యర్థులు ఓడిపోతూనే ఉన్నారు. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు అనేది బహిరంగ రహస్యం.

పార్టీ సీనియర్‌ నేత, జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ డా.మన్నే రవీంద్రకు స్థానికంగా ఉన్న నేతలకు ఏ మాత్రం సఖ్యత లేకుండా పోయిందనేది నియోజకవర్గంలో కార్యకర్తల మాట. ఎన్నికల వరకు కలిసే ఉన్నట్లు కనిపించే నేతలు… సరిగ్గా ఎన్నికల సమయంలో మాత్రం గ్రూపులుగా విడిపోవడం యర్రగొండపాలెం టీడీపీ నేతల ప్రత్యేకత. ఇదే వైసీపీకి అన్ని విధాలుగా కలిసి వస్తున్న అంశం. ఈ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా వరుసగా రెండుసార్లు పోటీ చేసిన ఓడిన బూదాల అజితారావు చెన్నైలోనే నివాసిస్తున్నారు. ఎన్నికలప్పుడు రావడం.. హడావుడి చేయడం వల్లే రెండుసార్లు ఓడినట్లు నిర్దారణకు టీడీపీ అధినాయకత్వం వచ్చింది.

Also Read : నేనే రాజు… నేనే మంత్రి… నా మాటే శాసనం…!

దీంతో ఎన్నికకు ఏడాది ముందే ఎరిక్షన్ బాబు పేరును చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. మొదట్లో ఎరిక్షన్‌బాబుకు అందరు నేతలు సహకరించినప్పటికీ… క్రమంగా హ్యాండ్‌ ఇచ్చారనేది వాస్తవం. ఎరిక్షన్‌బాబు గెలిస్తే నియోజకవర్గంలో తమ ఆధిపత్యానికి బ్రేక్ పడుతుందనే భయంతో… లోపాయకారిగా వైసీపీ నేత గెలుపు కోసం మన్నే రవీంద్ర టీమ్‌ పనిచేసిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే సరిగ్గా ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగిన బూదాల అజితారావుకు మన్నే రవీంద్ర టీమ్‌ సహకరించారనేది ప్రధాన ఆరోపణ. అందుకే ఎన్నికల్లో ఎరిక్షన్‌బాబు ఓడిపోయాడనేది టీడీపీ నేతల మాట.

వైసీపీ ఎమ్మెల్యే తీరును కూడా టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ పైన, ఎరిక్షన్‌బాబుపైన ఆరోపణలు చేసే ఎమ్మెల్యే తాటిపర్తి.. సీనియర్‌ నేత మన్నే రవీంద్రను మాత్రం పల్లెత్తు మాట ఎందుకు అనటం లేదని ప్రశ్నిస్తున్నారు. అటు మన్నే కూడా… ఎమ్మెల్యేపై ఎలాంటి విమర్శలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ ఓటమి ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికైనా అధినాయకత్వం యర్రగొండపాలెం నియోజకవర్గంపై దృష్టి పెట్టి… గ్రూప్‌ రాజకీయాలకు తెర పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పని చేసే నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్