అనంతపురం జిల్లా, ఉరవకొండ సభలో సీఎం చంద్రబాబు పీ4 కార్యక్రమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.సమాజాన్ని ఆసరా చేసుకుని బాగుపడినవారు ఆలోచించాలని కోరారు సిఎం చంద్రబాబు. ఇంకా ఎంతోమంది పేదరికంలోనే ఉన్నారని, పేదవాళ్లను పైకి తీసుకువచ్చేందుకు తమ పరిధిలో చేయూత ఇవ్వాలని కోరారు చంద్రబాబు. కిందస్థాయిలో ఉన్న 20 శాతం మందికి అండగా ఉందామని పిలుపునిచ్చారు. సూచనలు, సలహాలే కాదు.. అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేద్దామని కోరారు.
Also Read : ధనుంజయ రెడ్డి అరెస్ట్..? ఎంటర్ అయిన ఈడీ..?
అండదండలు లేక ఎంతోమంది యువత కూలీలుగా మారుతున్నారన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసారు. పేదవాడు ఆకలితో ఉండే సమాజానికి మంచిది కాదన్నారు. పేదవారి జీవితాల్లో వెలుగులు తెచ్చేవరకు మీతోనే ఉంటామన్నారు. కష్టపడి చదువుకుని పైకి వచ్చినవారు ఎంతోమంది ఉన్నారన్నారు చంద్రబాబు. సరైన సమయంలో సరైన గైడెన్స్ ఉంటేనే జీవితంలోకి పైకి రాగలమని వ్యాఖ్యానించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.
Also Read : ఆగని పాక్ ప్రయత్నాలు.. మళ్ళీ ఏడుగురిని పంపింది..!
మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలిపారు. టెక్నాలజీ సరిగా వాడుకుంటే మనం ముందుకెళ్లగలమన్నారు సిఎం. మీ భూముల్లో ఏయే పంటలు పండుతాయో తెలుసుకునే టెక్నాలజీ వచ్చిందని.. నేరాలు చేసి ఎవరూ తప్పించుకోలేరు సీసీ కెమెరాలు, డ్రోన్లు ఉన్నాయని హెచ్చరించారు. సైనికులకు దేశం మొత్తం అండగా ఉంటుందని, పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందన్నారు. సైనికులకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.