Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. కారణం అదే..?

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 5, 6 తేదీల్లో ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు ఉండనున్నారు. 5వ తారీఖు ఉదయం ఢిల్లీ వెళుతున్న సీఎం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం చంద్రబాబు వైజాగ్ వెళ్తారు. ఆరో తేదీ వైజాగ్ లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం తిరిగి వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం. ఆరో తేదీ ఢిల్లీలో ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.

Also Read :కర్ణాటకలో గోరంట్ల మాధవ్.. రక్షణ కల్పిస్తోంది ఎవరూ…?

ఆరున ఢిల్లీలోనే ఉండే చంద్రబాబు.. ఏడో తేదీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశాలున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి ఢిల్లీ పర్యటన ఆసక్తినీ రేపుతోందని చెప్పాలి. మార్చి 15 నుంచి అమరావతి పనులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించేందుకు చంద్రబాబు వెళ్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పోలవరం పర్యటనకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు ఆహ్వానించే అవకాశముంది అనే వార్తలు వస్తున్నాయి.

Also Read : చంద్రబాబుపై జీవీ రెడ్డి వ్యాఖ్యలు.. ఇదేంటి మళ్లీ..!

అమరావతి పనులు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా చేయించేందుకు చంద్రబాబు ఆహ్వానిస్తున్నారట. ఓ కీలక భవనానికి త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం అమరావతి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించిన నేపథ్యంలో ప్రధానమంత్రిని ఆహ్వానిస్తే బాగుంటుంది అని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ రాజ్యసభ సీటు గురించి కూడా ప్రధానమంత్రి తో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్