Friday, September 12, 2025 11:04 PM
Friday, September 12, 2025 11:04 PM
roots

ఏపీపై రైల్వే శాఖ వరాల జల్లు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థ మెరుగుపడితే.. ఆర్థికాభివృద్ధి సాధిస్తామనే చంద్రబాబు వ్యాఖ్యలకు కేంద్రం కూడా మద్దతిస్తోంది. ఐదేళ్లుగా ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అనేది వాస్తవం. చివరికి రహదారులపై ఏర్పడిన గుంతలను కూడా పూడ్చలేదు. అలాగే పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కూడా వైసీపీ సర్కార్ దృష్టి సారించలేదు. దీంతో భూసేకరణ పూర్తి కాకపోవడంతో చాలా పనులు నత్తతో పోటీ పడ్డాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనుల్లో వేగం పుంజుకుంది. కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు, ప్రయాణీకులకు మెరుగైస సౌకర్యాల కల్పనపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది.

Also Read: తెలుగుదేశం.. పడిలేచిన కెరటం..!

ఐదేళ్లుగా అందని ద్రాక్ష మాదిరిగా ఊరిస్తున్న విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు భూమి కేటాయించకుండా జగన్ సర్కార్ ఐదేళ్లు కాలయాపన చేసింది. దీనిపై రైల్వే శాఖ మంత్రి స్వయంగా పార్లమెంట్‌లోనే జవాబిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే స్థలాన్ని కేటాయించారు. దీంతో రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం ప్రారంభమైంది. ఇక కొత్త రైల్వే మార్గాల కేటాయింపులో కూడా ఏపీకి మేలు జరిగింది. రాజధాని అమరావతి మీదుగా కొత్త రైల్వే మార్గాన్ని కేంద్రం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌కూ ఆమోదం తెలిపిన రైల్వే శాఖ… ఏకంగా రూ.2,500 కోట్ల నిధులను కూడా కేటాయించింది.

Also Read: నేను సీఎం గా ఉండగా మీ ఆటలు సాగవు.. టాలీవుడ్ కు రేవంత్ స్ట్రోక్

అలాగే విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం తగ్గించేందుకు కీలకమైన గుంటూరు-నల్గొండ-బీబీనగర్ మార్గాన్న డబ్లింగ్ చేసేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగటంతో పనులు ప్రారంభమయ్యాయి కూడా. ఇక విష్ణుపురం-జగ్గయ్యపేట-మోటుమర్రి మధ్య నిర్మిస్తున్న రైల్వే లైను దాదాపు పూర్తి కావస్తోంది. ఇప్పటికే ఈ మార్గంలో ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు. అలాగే నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో ఇప్పటికే న్యూ పిడుగురాళ్ల – శావల్యాపురం పూర్తి కాగా… తాజాగా కురిచేడు – దర్శి మార్గంలో కూడా ట్రయల్ రన్ నిర్వహించారు. వీటన్నిటితో పాటు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొవ్వూరు-భద్రాచలం రైలు మార్గం కోసం ఎంపీ పురందేశ్వరి చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆమోదం తెలిపారు.

Also Read: వర్మపై ఏపీ సర్కార్ రివేంజ్…?

త్వరలోనే ఈ మార్గంలో పనులు ప్రారంభిస్తున్నట్లు ఇటీవల శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రకటించారు కూడా. దీని వల్ల విశాఖ-హైదరాబాద్ మధ్య ఏకంగా 130 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఇక రైళ్ల కేటాయింపులో కూడా కూటమి సర్కార్ విజయం సాధించిందనే చెప్పాలి. ఆరు నెలల కాలంలో విశాఖ నుంచి కొత్తగా మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. విశాఖ – సికింద్రాబాద్ మధ్య రెండో రైలు, విశాఖ – దుర్గ్, విశాఖ – భువనేశ్వర్ మధ్య కూడా వందేభారత్ పరుగులు పెడుతోంది. అలాగే విజయవాడ – చెన్నై మధ్య వయా రేణిగుంట వందే భారత్ నడుస్తోంది. ఈ రైలును త్వరలోనే భీమవరం వరకు పొడిగించనున్నారు.

New Vandebharat Trains To Andhra Pradesh
New Vandebharat Trains To Andhra Pradesh

ఇక జనవరి నెల నుంచి అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైళ్లల్లో తొలి రైలును కూడా ఏపీకే కేటాయించింది రైల్వే శాఖ. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖ-తిరుపతి, విశాఖ-బెంగళూరు మధ్య వందేభారత్ రైళ్లు నడపాలని ఆ ప్రాంత ఎంపీలు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ… సుమారు 800 కిలోమీటర్ల దూరం కావడంతో విశాఖ – తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు నడిపేందుకు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. రైలు వేళలు ఖరారైతే… దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తిరిగే మొదటి వందేభారత్ స్లీపర్ రైలు ఇదే అవుతుంది కూడా.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్