వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశంలో ఉన్న వలస దారులను భయపెడుతున్నాయి. దీనితో పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా.. దేశంలో జరుగుతున్న నిరసనల నేపధ్యంలో ట్రంప్ సర్కార్ అలెర్ట్ అయింది. దీనితో సోమవారం లాస్ ఏంజిల్స్ కు దాదాపు 700 మంది బలగాలను అదనంగా పంపింది ట్రంప్ సర్కార్.
Also Read : ఆ నేతల వారసులు ఏమయ్యారు..?
నిరసనలు నాల్గవ రోజుకు చేరుకుంటున్న నేపధ్యంలో.. అక్కడ భద్రతగా ఉన్న నేషనల్ గార్డ్ దళాలకు మద్దతుగా వీరిని పంపింది. 2,000 మంది నేషనల్ గార్డ్ దళాలను ఇప్పటికే అదనంగా మొహరించారు. మొత్తం నేషనల్ గార్డ్ సిబ్బందిని 4 వేల మందికి పైగా మొహరించారు. ఇంకా చట్టాన్ని అమలు చేయక ముందే ఈ స్థాయిలో నిరసనలు జరగడంతో ట్రంప్ సర్కార్ అలెర్ట్ అవుతోంది. అయితే.. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ మాత్రం ట్రంప్ చర్యలకు సహకరించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Also Read : దుమ్ము రేపిన బాలయ్య.. షేక్ చేస్తున్న అఖండ తాండవం
భారీగా బలగాలను పంపినా.. గవర్నర్ మాత్రం ఇప్పటివరకు 300 మంది సైనికులను మాత్రమే మొహరించారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా సోమవారం ట్రంప్ పరిపాలనపై దావా వేసినట్లు ప్రకటించారు. తమ రాష్ట్రంపై తనకు లేని అధికారాలను ట్రంప్ వాడాలి అనుకుంటున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. ఇది రాష్ట్ర సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. నేషనల్ గార్డ్ దళాలను చట్టవిరుద్ధంగా మొహరించడాన్ని తాము తేలికగా తీసుకునేది లేదని హెచ్చరించారు.




