ఆంధ్రప్రదేశ్ లో నీటి సంఘాల ఎన్నికలు అన్నీ దాదాపుగా ఏకగ్రీవం అయ్యాయి. ముఖ్యంగా కడప జిల్లాలో ఏకగ్రీవం కావడం సంచలనమైంది. పులివెందుల నియోజకవర్గంలో నీటి సంఘాల ఎన్నికలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం అవ్వడంతో మీడియా సమావేశం నిర్వహించిన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బిటెక్ రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 1978 నుంచి నిర్మించుకున్న మీ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పేకలించిన ఘనత మా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు చెందుతుందన్నారు.
Also Read: వైసీపీ కామెడి.. అల్లు అర్జున్ మాత్రమే మనిషా..? 5 ఏళ్ళ పాపాలు మరిచారా..?
పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగం పోయిందన్న రవి… భారత రాజ్యాంగం మాత్రమే ఉందని స్పష్టం చేసారు. పులివెందుల నియోజకవర్గంలో మా పార్టి నాయకులు, కార్యకర్తలు మీసం మెలేస్తున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టిన కూడా మా పార్టీ అభ్యర్థులు ధైర్యంగా నామినేషన్ వెయ్యడానికి ముందుకువచ్చారన్నారు రవి. ఇప్పుడు సాగునీటి ఎన్నికల సందర్భంగా మీ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వెయ్యడానికి కూడా MRO కార్యాలయాల దరిదాపుల్లోకి కూడా రాలేదంటూ కామెంట్స్ చేసారు.
Also Read: టాలీవుడ్ రేవంత్ ను తక్కువ అంచనా వేసిందా..?
అస్సలు సిస్సలు దద్దమ్మలు మీరే.. మేము కాదని ఎద్దేవా చేసారు. చేతగాని దద్దమ్మలు కాబట్టే సాగునీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేదు.. మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది అంటూ నిలదీశారు. ఇంకా సిగ్గు లేకుండా బాయ్ కాట్ చేశాము అని గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఇది ట్రైలర్ మాత్రమే.. ముందుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విధానాన్ని అవలంభిస్తాం అంటూ హెచ్చరించారు. మీకు దమ్ముంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయండి అంటు పులివెందుల ఎమ్మెల్యే జగన్ కి, ఎంపీ అవినాష్ రెడ్డికి సవాలు చేసారు బిటెక్ రవి.




