Saturday, September 13, 2025 05:17 AM
Saturday, September 13, 2025 05:17 AM
roots

లెక్కలతో అవినాష్ రెడ్డి బండారం బయటపెట్టిన రవి

గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారు అనే ఆరోపణలు మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి అక్రమాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీటెక్ రవి. అవినాష్ రెడ్డి పై ఆయన పలు సంచలన ఆరోపణలు చేసారు. వైయస్సార్సీపి ప్రభుత్వంలో నియోజకవర్గంలో లెక్కలేనన్ని భూ కబ్జాలు చేశారని, వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులే తొండూరు మండలంలో 200 ఎకరాలు ప్రభుత్వ భూమి ఆక్రమించి సాగు చేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూమిని యాభై వేల రూపాయలు రేటు కట్టి కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేశారని బయటపెట్టారు.

Also Read: ఆంధ్రప్రదేశ్ లో బయటపడ్డ మరో అవినీతి పుట్ట

దీని పైన విచారణ జరిగితే ఎమ్మార్వోలు, రిజిస్టర్లు ఇంటికి పోతారన్న ఆయన… వైయస్ అవినాష్ రెడ్డి పిఏ అంబాకపల్లి గ్రామంలో అటవి శాఖ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటురన్నారని ఆరోపించారు. వైయస్ అవినాష్ రెడ్డి.. ఆయన వెనకేసుకొస్తున్న వాళ్ళందరూ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని… దేవిరెడ్డి శంకర్ రెడ్డి దొడ్ల వాగు గ్రామంలో 30 ఎకరాల భూమిని ఆక్రమించారని సాక్ష్యాలతో సహా ఆరోపించారు. పులివెందుల మున్సిపల్ చైర్మన్ డికెటి భూములు ఆక్రమించారని.. ఆ భూమి తనది కాదంటే తాము నిరుపేదలకు ఆ భూములు పంచుతామన్నారని తెలిపారు.

Also Read: వారి కోసం వైసీపీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్…!

వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా భూ ఆక్రమణలు చేసి ఉంటే పులివెందుల ఆర్డీవో కు డిఎస్పీకి, తనకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారన్న రవి… పులివెందుల జరిగిన భూ ఆక్రమణల పై విచారణ చేపిస్తామని.. తర్వలొ తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాను కానీ, తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక్క సెంటు భూ కబ్జా చేసినట్లు నిరూపిస్తే వైయస్ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పి రాజకీయ నుంచి తప్పుకుంటానని సవాల్ చేసారు. బిటెక్ రవి చేసిన అవినీతి ఆరోపణలతో ఏపి రాజకీయాలు కీలక పరిణామాలకు దారితీయనున్నాయా అన్న చర్చ జోరుగా సాగుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్