తెలంగాణలో ఇప్పుడు భారత రాష్ట్ర సమితి చేస్తున్న రాజకీయం కాస్త ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా సరే బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ కావాలని ప్రయత్నాలు చేస్తుండడం చూసి పోలీసులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి అలాగే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ అయిన విధానాలు చూస్తుంటే చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉంది. వాస్తవానికి రాజకీయాల్లో అరెస్టుకు మంచి సెంటిమెంట్ ఉంది. అరెస్ట్ అయిన నాయకులు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు అయిన చరిత్ర ఉంది.
Also Read: అదాని నిన్ను ఎంతకు కొన్నాడు చంద్రబాబు..?
కేంద్ర మంత్రులు కూడా అయ్యారు కొంతమంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఒకానొక దశలో అరెస్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఇదే ట్రెండ్ ను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా కంటిన్యూ చేస్తున్నారు నాయకులు. తెలంగాణలో ఇప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఎప్పుడు అరెస్ట్ అవుదామా అనే ప్రయత్నాల్లోనే కనపడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదేపదే రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం.. అలాగే తమను అరెస్టు చేస్తారు అంటూ ప్రజల్లోకి బలంగా ఓ ప్రచారాన్ని తీసుకెళ్లడం తద్వారా తాము చేసిన తప్పులను కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం..
అలాగే పోలీసులను రెచ్చగొట్టి పోలీసు విధులను ఇబ్బంది పెట్టి అరెస్టు కావాలని చూడడం చూస్తుంటే కాస్త ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం పాడి కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున హడావుడి చేశారు. ఏకంగా పోలీస్ అధికారి వాహనానికే తన వాహనాన్ని అడ్డుపెట్టి అక్కడ ఇబ్బంది కలిగించారు. దీనితో అక్కడికి చేరుకున్న పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అదే రోజు సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇక కౌశిక్ రెడ్డికి మద్దతుగా వెళ్లిన హరీష్ రావును కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: అక్రమ దందా.. ఎస్పీపైనే అనుమానాలు అన్నీ…?
ఆ తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఇప్పుడు టిఆర్ఎస్ నేతలు కావాలనే అరెస్టులై ప్రభుత్వం తమను కావాలని టార్గెట్ చేసిందని చెప్పే ప్రయత్నం మొదలుపెట్టారు. వాస్తవానికి గతంలో కేసులు పెడితే నాయకులు భయపడిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు నాయకులు మాత్రం కావాలని కేసులు పెట్టించుకునే ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఇదే ట్రెండ్ మొదలు పెట్టగా దానిని ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కంటిన్యూ చేయడం మొదలుపెట్టారు.
ఫోన్ టాపింగ్ విషయంలో ముఖ్యమంత్రి పై కేసు పెట్టాలి అంటూ పాడి కౌశిక్ రెడ్డి చేసి పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మూడు రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు పై సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి కేసు పెట్టాడు. ఆ కేసుపై ప్రతి కారం తీర్చుకునేందుకు పాడి కౌశిక్ రెడ్డి హరీష్ రావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ టాప్ చేస్తున్నారని కేసు పెట్టారు. ఇలా ఇప్పుడు అరెస్టు రాజకీయం కేసుల రాజకీయం తెలంగాణలో బలంగా నడుస్తోంది. గతంలో రేవంత్ రెడ్డి తప్పు చేయకపోయినా ప్రభుత్వం అరెస్టు చేసిన పరిస్థితి. ఆ సమయంలో ఆయనకు బాగా సానుభూతి వచ్చింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేస్తూ తిరిగి అధికారంలోకి రావాలని గులాబీ పార్టీ నేతలు తీవ్రంగా కష్టపడుతున్నారు.