తెలంగాణ అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారమే రేపుతున్నాయి. స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా మీడియా సమావేశాలతో పాటుగా అసెంబ్లీ లో కూడా జగదీశ్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. గులాబీ పార్టీ కులాహంకారానికి ఇది ఉదాహరణ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.
Also Read : చంద్రయ్య కేసు సిఐడీకి.. న్యాయం జరుగుతుందా..?
అటు జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. అసలు జగదీష్ రెడ్డి ఏమన్నారంటే.. ఈ సభ అందరిదీ సభ్యులందరి కి సమాన అవకాశాలు ఉన్నాయి.. మా అందరి తరపున నువ్వు పెద్ద మనిషిగా స్పీకర్ గా కూర్చున్నావు.. ఈ సభ మీ సొంతం కాదు అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారని మంత్రులు మండిపడుతున్నారు.
Also Read : వైసీపీ నేతల్లో ఆ భయం.. కూటమికి బలం..!
స్పీకర్ దళిత వ్యక్తి కావడంతోనే ఆయన ఆ విధంగా అవమానించారని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఇక దీనికి కౌంటర్ ఇవ్వలేక గులాబీ పార్టీ సోషల్ మీడియా కూడా దాదాపుగా సైలెంట్ అయిపోయింది. ఇక గతంలో రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. ఇక ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దళిత సామాజిక వర్గ నేతలు.. మాజీ సీఎం కేసీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరిపై విమర్శలు చేస్తున్నారు. కావాలని జగదీశ్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని ఆయనను సభను సస్పెండ్ చేయాలని.. ఆరు నెలలపాటు ఆయనపై సస్పెన్షన్ విధించాలని కోరుతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. అసలు జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేంటి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.