Sunday, March 22, 2026 07:14 AM
Sunday, March 22, 2026 07:14 AM

అత్యంత గోప్యంగా అర్ధరాత్రి.. రేవంత్ ను తక్కువ అంచనా వేసారా..?

తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డిని అంచనా వేసే విషయంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితీ ఎప్పుడూ విఫలం అవుతూ ఉంటుంది. ఆ పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ రేవంత్ పై దూకుడుగా విమర్శలు చేయడమే గాని ఆయన ఏం చేయబోతున్నారు అనేది ఊహించలేని పరిస్థితి. కెటిఆర్ తిట్టిన తిట్లను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంలో నాయకులు, కార్యకర్తలు బిజీగా ఉంటారు. కానీ, వాళ్ళ ఊహకు అందని రాజకీయం రేవంత్ చేస్తున్నారు అనేది చాలా మందిలో వినపడే మాట.

Also Read : హీరో ఛాన్స్ మిస్ చేసుకున్న జగన్

ఇప్పుడు కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించిన విషయంలో బీఆర్ఎస్ ఆయనను తక్కువ అంచనా వేసింది. బీఆర్ఎస్ నాయకత్వానికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు, సభను నిరవధికంగా వాయిదా వేసే ముందు సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణా రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ విషయం మంత్రులకు కూడా స్పష్టత లేదు. సిఎస్, ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డికి మాత్రమే సమాచారం ఉంది.

Also Read : బెంగళూరు టూ పులివెందుల.. తాడేపల్లి లేనట్టే..!

కాళేశ్వరంపై చర్చ జరిగిన 9 గంటలు మంత్రులకు రేవంత్ అవకాశం ఇవ్వలేదు. ప్రతిపక్షం ఎన్ని విమర్శలు చేసినా సరే తానే సమాధానం చెప్పారు. హరీష్ రావు విషయంలో రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని గతంలో హరీష్ చెప్పిన విషయాన్ని కమీషన్ తన రిపోర్ట్ లో ప్రస్తావించిందని రేవంత్.. కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత హరీష్ సైలెంట్ అయ్యారు. ఇక సిబిఐకి సాధారణ సమ్మతి ఇచ్చే విషయంలో కూడా రేవంత్ పక్కా ప్లాన్ తో వెళ్ళారు. తాను సిబిఐకి భయపడను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు రేవంత్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్