Friday, September 12, 2025 03:29 PM
Friday, September 12, 2025 03:29 PM
roots

అల్లాడిస్తున్న బీఆర్ నాయుడు.. ఒంటరిగా తిరుమలలో తనిఖీలు

గత 5 ఏళ్ళుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున తిరుమల విషయంలో ఆరోపణలు వచ్చాయి. తిరుమల పవిత్రతను దెబ్బ తీసే విధంగా అప్పటి ప్రభుత్వం, అప్పటి పాలక మండలి వ్యవహరించింది అనేది ప్రధాన ఆరోపణ. ఇక ప్రభుత్వం మారిన తర్వాత అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల ప్రసాదంలో కూడా అక్రమాలు జరిగాయని తేల్చింది రాష్ట్ర సర్కార్. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : ఏపీ లిక్కర్ స్కాం.. ఆధారాలన్నీ హైదరాబాద్ లోనే..?

టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు ను నియమించిన తర్వాత తిరుమలలో పలు మార్పులకు ఆయన శ్రీకారం చుడుతూ వస్తున్నారు. అన్యమతస్తుల విషయంలో కూడా తిరుమలలో కఠినంగా వ్యవరించారు చైర్మన్. అంతే కాకుండా పలు సంస్కరణల దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. తిరుమలలో బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు కూడా అధికారులను భయపెడుతున్నాయి. అక్రమాలు జరిగే ప్రదేశాలపై ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. తాజాగా అన్నప్రసాదం భవనం, లడ్డూ విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేసారు.

Also Read : బ్రేకింగ్: ఏపీ లిక్కర్ స్కాంలో షేకింగ్ న్యూస్

వంటశాలలో అన్నప్రసాదాల తయారీ విధానంతో పాటు సరుకులు నిల్వచేసే స్టోర్ ను పరిశీలించారు బీఆర్ నాయుడు. వంటకాల రుచి, పరిశుభ్రత, సిబ్బంది నడవడిక గురించి భక్తులను అడిగి తెలుసుకున్న.. బీఆర్ నాయుడు, లడ్డూ ప్రసాదం కౌంటర్లను పరిశీలించారు. భక్తుల పట్ల గౌరవంగా, సేవాభావంతో నడుచుకోవాలని, అవకతవకలకు తావులేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. వ్యక్తిగత సిబ్బంది లేకుండా ఒంటిరిగా భక్తుల మధ్యకు వెళ్లి తనిఖీలు నిర్వహించడం గమనార్హం. భక్తులను ఆయన స్వయంగా లడ్డు నాణ్యత, రుచిపై అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం రుచి, నాణ్యత పెరిగిందని భక్తుల సంతృప్తి చేయడంతో ఆయన హర్షం వ్యక్తం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్