టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది బోర్డు. శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరణ గతంలో సీఎం చంద్రబాబు గరుడ వారధిగా ప్రాజెక్టు ప్రారంభించగా… దానిని గత ప్రభుత్వం శ్రీనివాస సేతుగా పేరు మార్చింది ఇప్పుడు గరుడ వారధిగా పేరును కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది బీఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు నమోదు చేయనున్నారు.
శ్రీవాణి ట్రస్ట్ ను రద్దు చేసి ప్రధాన ట్రస్ట్ కె నిధులు తరలిస్తారు. శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుంది నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచనున్నారు. లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం తీసుకున్న బోర్డు… ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
Also Read : పుష్ప పేరుతో వైసీపీ సోషల్ మీడియా పొలిటికల్ వార్
టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టూరిజం శాఖ ఇచ్చే 4 వేల టికెట్ల రద్దు నిర్ణయానికి బోర్డ్ ఆమోద ముద్ర వేసింది. టూరిజం శాఖ ఇచ్చే టికెట్లలో అవకతవకలు జరిగాయని పాలక మండలి పేర్కొంది. ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం ఏర్పాట్లు చేయనున్నారు. ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకున్న చెత్తను రెండు నెలల్లో తొలగించనున్నారు.
తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై పూర్తిగా నిషేధం విధించారు. తిరుపతిలోని స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం ఏర్పాటు చేశారు. శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటామని బోర్డు ప్రకటించింది. ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చిన భూముల లీజ్ రద్దు చేసారు. ప్రసాదాల తయారీ పోటుకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు.