వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమానిని.. అంటూ రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పుడు జైలు నుంచి పారిపోయాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తల్లికి అనారోగ్యం పేరుతో మద్యంతర బెయిల్ తీసుకుని కనపడకుండా పోయాడు బోరుగడ్డ అనిల్ కుమార్. తల్లికి అనారోగ్యం పేరుతో హైకోర్టుకు వెళ్లిన బోరుగడ్డ.. తన తల్లికి అనారోగ్యంగా ఉందని.. ఆమెకు చెన్నైలో చికిత్స చేయించాలి అంటూ కోర్టులో బెయిల్ కోరాడు. దీనితో గత నెల 15వ తేదీన ఆయనకు బెయిల్ వచ్చింది.
Also Read : విశాఖలో తోడళ్ళుళ్ళ సందడి.. నేషనల్ మీడియాలో హాట్ టాపిక్..!
ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అధికారులు గుట్టుగా విడుదల చేశారు. మళ్లీ హైకోర్టుకు వెళ్ళాడు బోరుగడ్డ అనిల్ కుమార్. తల్లికి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయించాలని గుంటూరు డాక్టర్ పేరుతో సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఈనెల 11వ వరకు కోర్టు బెయిల్ పొడిగించింది. చివరికి అది ఫేక్ సర్టిఫికెట్ గా నిర్ధారణ కావడంతో.. బోరుగడ్డ అనిల్ ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీనితో ఎక్కడున్నాడు.. ఏమైపోయాడు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 11న జైలుకు తిరిగి వస్తాడా లేదా అనే దానిపై పోలీసు వర్గాల్లో ఆందోళన మొదలైంది.
Also Read : వంశీకి బెయిల్ కష్టమేనా..? కోర్టులో ఆసక్తికర సన్నివేశాలు
సాధారణంగా హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత రిమాండ్ ఖైదీని విడుదల చేయడానికి కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. బెయిల్ విషయాన్ని జైలు సూపరింటెండెంట్.. పై అధికారులకు తెలియజేయాలి. అలాగే ఆ కేసు నమోదు అయిన పోలీస్ స్టేషన్ కు కూడా సమాచారం పంపించాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి ప్రొసీజర్స్ ఫాలో అవకుండా నేరుగా బెయిల్ రాగానే.. బోరుగడ్డ అనిల్ కుమార్ ను జైలు నుంచి విడుదల చేసేసారు అధికారులు.
Also Read : వివేకా కేసు.. మరో పరిటాల రవి కేసు అవుతోందా…?
కనీసం ఈ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారులకు కూడా తెలియకుండానే సూపరిండెంట్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ లో ఉన్నాడు. కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా.. మరికొన్ని కేసుల్లో మాత్రం అతనికి బెయిల్ రాలేదు. దీనితో తన తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపించి జైలు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసి ఎస్కేప్ అయిపోయాడు అనిల్ కుమార్.