Friday, September 12, 2025 07:18 PM
Friday, September 12, 2025 07:18 PM
roots

రోహిత్ – కోహ్లీ రిటైర్మెంట్ పై బోర్డ్ సంచలన కామెంట్స్

భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సంవత్సరం టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన నేపధ్యంలో వారి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తు వచ్చాయి. వాస్తవానికి వారికి ఇంగ్లాండ్ పర్యటన చివరిది అవుతోందని అందరూ భావించినా.. ఇంగ్లాండ్ వెళ్ళకుండానే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. మునపటి మాదిరి పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న నేపధ్యంలో.. వారు తప్పుకోవాలని ఒత్తిడి చేసినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్ పైనే ఆరోపణలు వినిపించాయి.

Also Read : శుభాన్షు శుక్లా శరీరంలో వచ్చే మార్పులు ఇవే..!

ఈ తరుణంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేసారు. రిటైర్ కావాలనేది పూర్తిగా ఆటగాడి నిర్ణయం అని స్పష్టం చేసారు. ఈ విషయంలో బోర్డు అసలు ఎప్పుడూ జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు రాజీవ్ శుక్లా. వాళ్ళు ఇద్దరూ లెజెండ్స్ అని.. వాళ్ళు కనీసం వన్డేలు అయినా ఆడాలి అనుకోవడం తమకు సంతోషంగా ఉందన్నారు. వాళ్ళంతట వాళ్ళే తప్పుకున్నారని పేర్కొన్నారు. ముందు రోహిత్ శర్మ రిటైర్ కాగా ఆ తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్ అవుతూ నిర్ణయం తీసుకున్నాడు.

Also Read : విమానం కంటే వేగవంతమైన రైలు.. చైనా సంచలనం

ఇద్దరూ తమ సోషల్ మీడియాలోనే ఈ పోస్ట్ లు చేసారు. రోహిత్ శర్మ ఈ ఏడాది రిటైర్ అవుతాడని భావించినా ఇంత త్వరగా అని ఎవరూ ఊహించలేదు. 38 ఏళ్ల రోహిత్ శర్మ భారత్ తరపున 67 టెస్టులు ఆడి, 40.57 సగటుతో 4301 పరుగులు చేసాడు. రోహిత్ తో పోలిస్తే విరాట్ కు ఫిట్నెస్ ఉంది. దీనితో మరో రెండేళ్ళ పాటు కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో కొనసాగే అవకాశం ఉందని ఊహించారు. ఇక కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌ లో 123 మ్యాచ్‌ల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో సహా 9230 పరుగులు చేసాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్