Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

చంద్రబాబు, పవన్ అభిప్రాయం తర్వాతే బిజెపి ఆ నిర్ణయం..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా బిజెపి అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసింది అధిష్టానం. ముఖ్యంగా ఏపీ నుంచి బిజెపి అధ్యక్షుడు ఎవరు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు నడిచాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్న సమయంలో.. బిజెపి అధిష్టానం సీనియర్ నాయకుల వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తోంది అనే ప్రచారం జరగడంతో ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు ఒకరు ఇద్దరు నాయకులు. అప్పటికే కూటమి పార్టీలతో మాట్లాడి బిజెపి ఓ నిర్ణయానికి వచ్చేసింది.

Also Read : వైసీపీ మైండ్ గేమ్.. వర్కవుట్ అవుతుందా..?

ఏపీ బిజెపి అధ్యక్షుడిగా మాధవ్ ను ఎంపిక చేసింది. ఈ విషయంలో జనసేన, టీడీపీ అభిప్రాయాన్నే తీసుకున్నట్టు సమాచారం. ఆ రెండు పార్టీలకు ఇబ్బంది లేని నాయకుడిని ఎంపిక చేసేందుకు ఆసక్తి చూపించింది. 2014 నుంచి 2019 వరకు బిజెపి నాయకులతోనే రాష్ట్రంలో ఎన్డియేలో చీలిక వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీకి అనుకూలంగా ఉండే ఓ వర్గం కారణంగా టీడీపీతో విభేదాలు వచ్చాయి. రాష్ట్రంలో టీడీపీ గురించి వ్యతిరేక నివేదికలు పంపడం, పదే పదే పార్టీ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సోము వీర్రాజు అండ్ గ్యాంగ్ చేస్తూ వచ్చింది.

Also Read : కేసీఆర్ కోసమే బీజేపీ నిర్ణయమా..?

వీటిని దృష్టిలో పెట్టుకున్న అధిష్టానం.. ప్రస్తుత అధ్యక్షురాలితో కూడా మాట్లాడిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాల్లో బిజెపి పోటీ చేయడమే కాకుండా, స్థానిక సంస్థల్లో బలోపేతం అయ్యే దిశగా పని చేయాలంటే మాధవ్ సమర్ధ నాయకుడు అని బిజెపి భావించినట్టు సమాచారం. బీసీ నేత కూడా కావడం, ఉత్తరాంధ్రలో కాస్త పట్టు ఉండటం కూడా కలిసి వచ్చే అంశాలు. ఆయన తండ్రి కూడా గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్