భారత్, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు అత్యంత కీలకమైన అంశం. వాణిజ్య, ఉద్యోగ, రక్షణ రంగాల్లో ఈ సంబంధాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ప్రపంచ దేశాల్లో పెద్దన్నగా పేరున్న అమెరికా… భారత్ తో సఖ్యత గానే ఉండేందుకు గత రెండు దశాబ్దాలుగా ఆసక్తి చూపిస్తుంది. అయితే అమెరికాను విపరీతంగా ప్రేమించే ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి రెండవసారి అధ్యక్షుడు అయిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అనేదానిపై ఆందోళన నెలకొంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీతో సఖ్యత గానే మెలిగారు.
Also Read : ఈ ఇద్దరి భవిష్యత్తు ఏంటీ..?
కానీ రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చున్న తర్వాత ఆయన స్వరంలో మార్పు కనపడుతోంది. తాజాగా రెండు దేశాల మధ్య సంబంధాలపై ఓ ప్రముఖ సంస్థ సర్వే నిర్వహించింది. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ యూ గవర్నెన్స్ సంస్థ అనే సంస్థ ఈ సర్వే చేసింది. అమెరికాలో దాదాపు 50 లక్షల మందికి పైగా భారతీయులు నివాసం ఉంటున్నారు. ఈ సర్వేలో భాగంగా భారతీయ అమెరికన్లను సదరు సంస్థ కొన్ని కీలక ప్రశ్నలు అడిగింది. మాజీ అధ్యక్షుడు బైడెన్ పాలనా కాలంలో అమెరికా, భారత సంబంధాలు ఏ విధంగా ఉన్నాయని భారతీయ, అమెరికన్లు భావిస్తున్నారు.. 2024 ఎన్నికల తర్వాత భారతదేశ గమనాన్ని ఏ విధంగా చూస్తున్నారు.. డోనాల్డ్ ట్రంప్ మంచి ప్రత్యామ్నాయమని మీరు భావిస్తున్నారా.. వంటి ప్రశ్నలను అడిగింది.
Also Read : కడప వైసీపీలో రాజకీయ రచ్చ..!
మొత్తం 1206 మంది భారతీయ అమెరికన్ల అభిప్రాయాలను ఆ సంస్థ సేకరించింది. అయితే మెజారిటీ ప్రజలు బైడెన్ పాలన కాలంలోనే రెండు దేశాల మధ్య సంబంధాలు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్ కంటే కమలహారిస్ అధ్యక్షురాలు అయి ఉంటే బాగుండేదని, రెండు దేశాలు మధ్య సంబంధాలు మరింత బలపడేవి అని చాలామంది అభిప్రాయపడ్డారు. భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు ట్రంప్ హయాంలో మెరుగుపడతాయని 66 శాతం మంది రిపబ్లికన్లు నమ్ముతున్నారట. 8 శాతం డెమొక్రాట్ లు దీనిని అంగీకరించడం లేదు. భారతీయ అమెరికన్ డెమోక్రట్లలో సగం మంది బైడెన్..కు మద్దతు ఇస్తున్నారు. రిపబ్లికన్లు 15 శాతం మంది మాత్రమే దీనికి అనుకూలంగా ఉన్నారు. అయితే భారతీయ అమెరికన్లు ఎక్కువ మంది డెమోక్రట్ పార్టీ మద్దతుదారులే కావడంతో బైడెన్..కు మద్దతు కాస్త ఎక్కువగా ఉందట.




