బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారమే రేపింది. ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కొందరు కీలక అధికారులపై రేవంత్ రెడ్డి అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాం అని హెచ్చరించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయంలో త్వరలోనే బాంబ్ పేలే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.
ఈ సమయంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లకు బిగ్ షాక్ ఇచ్చారు. ఇద్దరి పాస్పోర్టులను రద్దు చేసింది ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం. ఫోన్ ట్యాప్పింగ్ కేసులో దర్యాప్తుకు హాజరు కాకుండా అమెరికాలో తల దాచుకున్నారు ఇద్దరు. పాస్పోర్ట్ రద్దు అంశాన్ని అమెరికా పోలీసులకు తెలియజేసేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హైదరాబాద్ పోలీసులు నివేదిక పంపారు. పాస్పోర్ట్ రద్దు విషయం అక్కడి పోలీసులకు తెలిస్తే ఇద్దరిని బలవంతంగా దేశానికి పంపే అవకాశం ఉంది.
Also Read : బిగ్ బ్రేకింగ్: అమ్మకే బ్రతుకుపై అసహ్యం కలిగించారు
ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై లుకౌట్ నోటీసులు జారీ చేసారు పోలీసులు. మరో వైపు రెడ్ కార్నర్ నోటీస్ జారీకి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు… ఇప్పటికే హైదరాబాద్ పోలీసుల నివేదికను ఇంటర్ పోల్ కు సిబిఐ అధికారులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకుని అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాకర్ రావును ఎలా అయినా అరెస్ట్ చేయాలని అధికారులు సిద్దం కావడంతో… కేటిఆర్ ను ఈ విషయంలో ముందు అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నారు.