వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు అధికారులను టార్గెట్ చేసి అన్ని రకాలుగా వేధించిన సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వంలో నిఘా విభాగం అధిపతిగా పని చేసిన ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కక్ష సాధింపుగా వ్యవహరించి, ఆయనను విధుల నుంచి అన్యాయంగా తొలగించారు. న్యాయం కోసం సుప్రీం కోర్ట్ వరకు వెళ్లి ఏబీవీ పోరాడాల్సిన పరిస్థితి. 2014-2019లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఏబీ వెంకటేశ్వర రావు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్నారు. అయితే ఆ సమయంలో భద్రతా పరికరాల కొనుగోలు టెండర్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని గత ప్రభుత్వ హయాంలో 2021 మార్చిలో ఏసీబీ ఆయనపై కేసు నమోదైంది. తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని వెంకటేశ్వరరావు 2022లో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : కూటమి సర్కారుపై జగన్ ముఠా మరో కొత్త వ్యూహం..!
ఇజ్రాయెల్ నుంచి భద్రతా పరికరాల కొనుగోలు ప్రక్రియను అప్పటి డీజీపీ ప్రారంభించారని.. కొనుగోలు కమిటీ, సాంకేతిక కమిటీలను కూడా డీజీపీనే ఏర్పాటు చేశారని కోర్టులో విచారణ సందర్భంగా వెంకటేశ్వరరావు తరఫు లాయర్ సీనియర్ వాదనలు వినిపించారు. ఇలా ఏబీవీ పై ఏకపక్షంగా కేసులు నమోదు చేయించి వేధించారు ఏసీబీ అధికారులు. ఇక ఏబీవీ ని విధుల నుంచి కూడా తొలగించడం, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవడం వంటి చర్యలు జరిగాయి. టీడీపీ అధిష్టానం కూడా అప్పట్లో ఆయనకు అండగా నిలబడింది. ఇక టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకు న్యాయం జరుగుతూ వచ్చింది. ఈ సమయంలో ఆయన రాజకీయాల్లోకి కూడా అడుగు పెడతాను అంటూ ఓ ప్రకటన కూడా చేసారు. తాజాగా ఆయనకు కోర్ట్ లో భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్ట్ లో ఆయనపై నమోదు అయిన కేసులపై విచారణ జరిగింది.
Also Read : ఆపరేషన్ సిందూర్.. ఇండియన్ ఆర్మీ క్లారిటీ ఇదే
నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీవీపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. ఆ తర్వాత చార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది ఏసీబీ. ఇక తాజాగా ఏసీబీ కోర్టులో దాఖలైన ఛార్జ్ షీట్‍ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణను నిలిపేసిన హైకోర్టు.. తాజాగా చార్జ్ షీట్ ను కొట్టేసింది. ఈ కేసులోనే ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది వైసీపీ ప్రభుత్వం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన పదవీ కాలంలో విధులు నిర్వహించినట్లుగా పేర్కొంటూ జీతం కూడా చెల్లించింది సర్కార్.