ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒకటే హాట్ టాపిక్… అదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. అరెస్టు వ్యవహారం. అసలు కేటీఆర్ అరెస్టు ఎందుకు అనే విషయం కంటే కూడా… తర్వాత జరిగే పరిణామాలపైనే చర్చించుకుంటున్నారు. వాస్తవానికి కేటీఆర్ అరెస్టు కారణాల గురించి భారతీయ రాష్ట్ర సమితి… బీఆర్ఎస్ నేతలకు కూడా సరిగ్గా తెలియదు. అయితే అరెస్టు చేయటం మాత్రం అన్యాయం, అక్రమం అంటూ తెగ గోల పెడుతున్నారు. ఇక మరికొందరైతే ఏకంగా కొత్త భాష్యం చెబుతున్నారు. అప్పట్లో రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు కాబట్టి… ఇప్పుడు అందుకు రివేంజ్ గా కేటీఆర్ ను అరెస్టు చేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం కేటీఆర్ అరెస్టు అయితేనే బాగుంటుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు.
Also Read : వైసీపీకి విశాఖలో మరో షాక్
కేటీఆర్ ను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేస్తే… అది బీఆర్ఎస్ కు మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు కొందరు పార్టీ నేతలు. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు రావటం లేదు. ఏడాది కాలంలో కేవలం ఒకే ఒక్క రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారం చేసినా కూడా.. అస్సలు ఫలితం చూపించలేదు. దీంతో కేసీఆర్ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పారనే పుకార్లు వినిపిస్తున్నాయి కూడా.
Also Read : ఐ లవ్ యూ.. బుగ్గలు రుద్దను.. తలపై ముద్దులు పెట్టను: పవన్ కామెంట్స్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఎన్నికల్లో ఓటమి, నేతలు పార్టీ మారటం, పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్లు రాకపోవడంతో… పార్టీ కేడర్ అంతా ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో జరిగితే గులాబీ పార్టీకి మరోసారి ఓటమి తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి పరిస్థితుల్లో నేతలు, కార్యకర్తలను తిరిగి యాక్టివ్ మోడ్ లోకి తీసుకుని రావాలంటే.. ఒక పెద్ద ఇష్యూ జరగాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేటీఆర్ అరెస్ట్ జరిగితే అది బీఆర్ఎస్ కు మంచి మైలేజ్ ఇస్తుందనేది పార్టీ నేతల భావన. అయితే ఇదే సమయంలో మరో విషయం కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులు ఈడీ అరెస్టు చేసింది. దాదాపు 5 నెలలపాటు తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కవిత జైల్లో ఉన్న సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. అంటే సానుభూతి పనిచేయలేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు కూడా ఓటర్లు సానుభూతి చూపించకపోతే పార్టీ పరిస్థితి ఏమిటనే మాట వినిపిస్తోంది.