Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైం

మన దేశంలో ఐఫోన్ కు ఉండే క్రేజ్ వేరే లెవెల్. చిన్నాళ్ళ నుంచి పెద్ద వారి వరకు ఐఫోన్ ను ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తూ ఉంటారు. అందుకే యాపిల్ కూడా మన దేశంలో ఐఫోన్ ల తయారి ప్లాంట్ కూడా ఏర్పాటు చేసింది. ఇక తాజాగా ధరలను కూడా పెద్ద ఎత్తున తగ్గించింది యాపిల్. ఐఫోన్ కొనాలి అనుకునే వారికి ఇది మంచి సమయం అంటున్నారు నిపుణులు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సైట్స్ లో ధరలు భారీగా తగ్గాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రోలపై ధరలు భారీగా తగ్గాయి.

Also Read : బూమ్రా ప్రవర్తనపై అభిమానులు ఫైర్.. కాస్త తగ్గు..!

ఐఫోన్ 15 ధర దాదాపుగా 19 వేల వరకు తగ్గింది. అమెజాన్‌లో కేవలం రూ.61,390కే ఈ ఫోన్ దొరుకుతోంది. ప్రారంభంలో రూ.79,990కి విక్రయించిన ఈ ఫోన్ ను ఇప్పుడు ఏకంగా రూ.18,510 తగ్గించారు. దానితో పాటు, రూ.1,841 క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఐఫోన్ 15 A16 బయోనిక్ చిప్‌తో తయారు చేసారు. 6.1-అంగుళాల డిస్‌ప్లేతో పాటుగా, 48MP కెమెరా ఉంది. ఐఫోన్ 16 ను గత ఏడాది యాపిల్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర కూడా భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గిన ధరకు విక్రయిస్తున్నారు.

Also Read : బ్యాంక్ ఖాతాలపై సంచలన నిర్ణయం

రూ.68,780కి అందుబాటులోకి వచ్చింది ఈ మొబైల్. అసలు ధర రూ.79,900 కాగా.. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆఫర్లతో రూ.6,120 తగ్గింది. అదనంగా రూ.4,000 డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ మోడల్ A18 బయోనిక్ చిప్ తో పాటుగా లేటెస్ట్ AI ఫీచర్లతో వర్క్ చేస్తుంది. ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే.. గత ఏడాది రిలీజ్ చేసినప్పుడు ప్రో వేరియంట్ ధర రూ.1,19,900గా ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు రూ.14,000 భారీగా తగ్గించారు. దీనితో కేవలం రూ.1,05,355కే అందుబాటులో ఉంది. దీని ధర రూ.1,12,900గా ఉన్నా.. మరో 7 వేలు పలు కార్డుల మీద డిస్కౌంట్ వస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్