న్యూజిలాండ్ తో టెస్ట్ సీరీస్ ఓటమి, ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమి, ప్రస్తుత ఇంగ్లాండ్ సీరీస్ లో కీలక లోపాల నేపధ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ కోచ్ ల విషయంలో కఠినంగానే ముందుకు వెళ్ళే అవకాశం కనపడుతోంది. మొదటి, నాలుగు టెస్ట్ లలో బౌలింగ్ లోపాలు స్పష్టంగా కనిపించాయి. గెలిచే అవకాశాలను నాశనం చేసాయి. దీనితో కోచింగ్ స్టాఫ్ విషయంలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది బోర్డు.
Also Read : మార్చుకుంటారా.. లేదా.. లాస్ట్ వార్నింగ్..!
హెడ్ కోచ్ గంభీర్ ను మినహాయించి మిగిలిన వారిని పక్కన పెట్టాలని భావిస్తోంది. బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మరియు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డేష్కాట్ లను ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వీరి సహకారం జట్టుకు లేదనే విమర్శలు వినపడుతున్నాయి. బౌలింగ్ విభాగం కారణంగానే ఆస్ట్రేలియా సీరీస్ ఓడిపోయామనే ఆగ్రహంలో బోర్డు ఉంది. ఇప్పుడు ఇంగ్లాండ్ సీరీస్ కూడా అలాగే ప్రమాదంలో పడింది. ఇప్పటికే బోర్డు పెద్దలు దీనిపై సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
Also Read : గజపతి రాజు సిగరెట్ కష్టాలు.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
గంభీర్ కు కూడా మరో అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. అయితే నాలుగో టెస్ట్ లో కుల్దీప్ యాదవ్ ను పక్కన పెట్టాలని తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై బోర్డు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ తర్వాత మాత్రమే ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అన్షుల్ కాంబోజ్‌ను నాల్గవ టెస్ట్ కు ఎంపిక చేయడంపై బోర్డు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. సెలెక్షన్ కమిటీ విషయంలో కూడా బోర్డు సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.