Saturday, September 13, 2025 02:35 AM
Saturday, September 13, 2025 02:35 AM
roots

బంగారపు హుండీని చిల్లర కోసం వాడుతున్నారు

అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కు లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ లేకపోవడం అనేది కచ్చితంగా మైనస్. ముఖ్యంగా విదేశాల్లో టెస్టు సిరీస్ లు ఆడినప్పుడు ఈ లోటు కచ్చితంగా కనబడుతుంది. ముఖ్యంగా స్వింగ్ కు అనుకూలించే మైదానాల్లో లెఫ్ట్ హ్యాండ్ పేసర్ లేకపోవడం అనేది విజయా అవకాశాలను కచ్చితంగా దెబ్బతీస్తుంది అనే చెప్పాలి. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ లో లెఫ్ట్ హ్యాండ్ పేసర్ లేకపోవడం కచ్చితంగా మైనస్ అని అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Also Read : గాయం సాకు.. రంజీలకు దూరంగా రాహుల్, కోహ్లీ..?

అయితే ఉన్న వనరులను వాడుకోవడంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమవుతుందనే ఆరోపణలు వినపడుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను వాడుకునే విషయంలో సెలెక్టర్లు ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కేవలం టి20 లకు మాత్రమే అతన్ని ఉపయోగించడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండులో కౌంటి మ్యాచులు ఆడిన అనుభవం ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ ను ఆస్ట్రేలియా సీరిస్ కు ఎంపిక చేయాల్సిన అవసరం ఉన్నా సరే పక్కన పెట్టారని మండిపడుతున్నారు.

Also Read : సరస్వతికి షాక్ ఇచ్చిన సర్కార్.. 25 ఎకరాలు లాగేశారు…!

అనవసరంగా టి20లకు సెలెక్ట్ చేసి ఒక టాలెంట్ ను వృధా చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా టి20లలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అతను చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు టి20 క్రికెట్లో చాహల్ 96 ఇంటర్నేషనల్ వికెట్లు తీయగా అర్షదీప్ సింగ్ 97 వికెట్లు తీశాడు. 61వ మ్యాచ్లో ఈ మైలురాయిని అధిగమించాడు ఈ బౌలర్. అయితే చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన సెలెక్టర్లు తుది జట్టులో కచ్చితంగా చోటు కల్పించాలని అభిమానులు కోరుతున్నారు. అనంతరం ఇంగ్లాండ్లో జరగబోయే టెస్ట్ సీరీస్ కు అతన్ని తీసుకెళ్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. బంగారపు హుండీని చిల్లర వేయడానికి వాడుతున్నారంటూ సినిమా డైలాగులతో సెలక్టర్ ల పై మండిపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్