Sunday, October 26, 2025 04:55 AM
Sunday, October 26, 2025 04:55 AM
roots

గిల్‌కు బోర్డు క్లారిటీ.. 2027 తర్వాతే నీకు ఛాన్స్

భారత క్రికెట్ లో కెప్టెన్సీ పదవి విషయంలో ఇప్పుడు పెద్ద రచ్చే జరుగుతుంది. దీనిపై మీడియాలో హడావుడి లేకపోయినా ఆటగాళ్ల మధ్య మాత్రం దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ వన్డే కెప్టెన్సీ కోసం ఎదురు చూస్తున్నాడు. అటు టి20 కెప్టెన్సీ కోసం కూడా అతను ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈమధ్య వార్తలు వచ్చాయి. అయితే రోహిత్ శర్మ తర్వాత శ్రయాస్ అయ్యర్ కు వన్డే కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది.

Also Read : తగ్గిన జీఎస్టీ.. ఏయే ధరలు తగ్గుతాయంటే..!

తాజాగా దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కొన్ని కథనాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ వైపే బోర్డు పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అభిమానులతో పాటుగా మీడియాలో కూడా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీని వెనుక రాజకీయాలు జరుగుతున్నాయని మాజీ ఆటగాళ్లు సైతం అభిప్రాయపడ్డారు. దీంతో బోర్డు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. దానికి తోడు రోహిత్ శర్మ లాంటి ఆటగాడిని అవమానిస్తే ప్రపంచవ్యాప్తంగా చులకన అవుతాము అనే భావనలో కూడా బోర్డు పెద్దలు ఉన్నట్లు సమాచారం.

Also Read : లండన్ లో కోహ్లీ ఫిట్నెస్ టెస్ట్.. షాక్ అయిన ఫ్యాన్స్

దీనితోనే వచ్చే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగుతాడని ఆటగాళ్లకు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు విరాట్ కోహ్లీ కూడా జట్టులో వచ్చే వరల్డ్ కప్ వరకు ఉంటాడని స్పష్టం చేసినట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అటు రిషబ్ పంత్ పేరు కూడా కెప్టెన్సీ కోసం పరిశీలనలో ఉన్నా సరే.. అతను రోహిత్ శర్మ కి మొగ్గు చూపినట్లు సమాచారం. బ్యాట్స్మెన్ కే ఎల్ రాహుల్, సీనియర్ ఆటగాడు జడేజా, ఫాస్ట్ బౌలర్ బూమ్రా, సిరాజ్ సైతం ఈ విషయంలో బోర్డు అభిప్రాయానికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక చేయడం దాదాపు ఖాయమే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్