Tuesday, October 28, 2025 02:22 AM
Tuesday, October 28, 2025 02:22 AM
roots

గద్దర్ కు పద్మ అవార్డా..? బాంబు పేల్చిన బండి

దివంగత ఉద్యమ నేత గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేసారు. నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేసారు. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేర్లు మార్చాలనుకుంటే మాత్రం…..ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందన్నారు. పరిస్థితి అంతవరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు.

Also Read: భారతక్క దగ్గర కూడా గందరగోళమే..!

సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ మేం అన్యాయం చేయబోం అని స్పష్టం చేసారు. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోంది కదా…. గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది? ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్ కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు.

Also Read: గవర్నర్ ఫోన్ ట్యాపింగ్.. కీలక సాక్ష్యాలు లభ్యం..!

గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు. ఇక పద్మ అవార్డుల గురించి మాట్లాడుతూ పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు… రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలన్నారు. గద్దర్ కు ఎట్లా పద్మ అవార్డులిస్తాం… ఎంత మంది బీజేపీ కార్యకర్తలను మట్టుపెట్టారో తెలియదా? అని నిలదీశారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తే… నక్సలైట్లతో కలిసి హ*త్యలు చేయించిన వ్యక్తి గద్దర్ అని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఎవరు లాభపడ్డారో… ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్ధమైందన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్