Tuesday, October 28, 2025 02:29 AM
Tuesday, October 28, 2025 02:29 AM
roots

పారితోషికం లోనూ అన్ స్టాప‌బుల్ గ దూసుకెళ్తున్న బాలయ్య

తన సినిమా వసూళ్లు వంద కోట్లు రీచ్ కావడంతో నట సింహం నందమూరి బాలకృష్ణ ఆలోచన మారిందా…? ఇప్పటి వరకు తీసుకొని నిర్ణయాలను బాలయ్య తీసుకుంటున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి ఆయన కెరీర్ లో 109వ సినిమా ‘డాకూ మహారాజ్’ కాగా మరొకటి అఖండ సీక్వెల్. డాకూ మహారాజ్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా టైటిల్ టీజర్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్.

అఖండ సీక్వెల్ ను కూడా అలాగే ప్లాన్ చేసారు. బాలకృష్ణ కెరీర్ లో అఖండ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బాగా ఫేమస్ అయింది. దీనితో ఈ సినిమాపై భారీగా బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు… బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది. దీనితో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ తరుణంలో… బాలయ్య కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో సినిమాకు 10 నుంచి 12 కోట్ల వరకు మాత్రమే తీసుకునే బాలకృష్ణ ఇప్పుడు తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారు అని టాక్.

వరసగా మూడు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరడం, దానికి తోడు ‘అన్ స్టాప‌బుల్’ షో హిట్టవ్వటంతో బాలయ్య కూడా పారితోషికం విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. హిట్లు మీద హిట్లు కొడుతూ బాల‌య్య త‌న పారితోషికాన్ని ఏకంగా రూ.40  కోట్ల వరకు పెంచేశారు అని సమాచారం. ఇక ఇప్పుడు డాకూ మహారాజ్ కు ఆయన 50 కోట్ల వరకు తీసుకుని ఉండవచ్చు అని అంచనా. అఖండ 3కు కూడా ఇదే స్థాయిలో పారితోషికం ఉంటుందని తెలుస్తుంది. బాలయ్యకి ఇప్పుడున్న క్రేజ్ తో బిజినెస్ భారీగా జరిగే అవకాశం ఉండటంతో బాలయ్య ఆలోచన కూడా మారింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. యువకులతో పోటీ పడి ఈ వయసులో కూడా సినిమాలు చేస్తున్న బాలయ్య… అఖండ సినిమా నుంచి హిట్ ట్రాక్ లోకి వచ్చేశారు. డాకూ మహారాజ్ సినిమాపై ఆయన ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్