నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు చూస్తే… కమర్షియల్ హంగులు చాలా తక్కువగా ఉంటాయి. సినిమాలో ఆయన మాత్రమే స్టార్ యాక్టర్… హీరోయిన్లు కూడా అవకాశాలు రాని వాళ్ళను, సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళను తీసుకుంటూ ఉంటారు బాలయ్య. గత పదేళ్ళలో ఇది ఎక్కువగా కనపడుతోంది. లెజెండ్ సినిమాతో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ కు బాలయ్య సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. ఇక అఖండలో కూడా అవకాశాలు రాని నటులకు కీలక పాత్రలు ఇవ్వడం సంచలనం అయింది.
కానీ ఇప్పుడు కొడుకు ఫ్యూచర్ విషయంలో బాలయ్య కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. తన పంథాను తన కొడుకు సినిమాల్లో కంటిన్యూ కాకుండా చూస్తున్నారు బాలయ్య. అవును… ఇప్పుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ చేస్తున్న సినిమాలో స్టార్ నటులను తీసుకుంటున్నారట. నెగటివ్ రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్ ను తీసుకుంటున్న ప్రశాంత్ వర్మ… ఓ టాలీవుడ్ స్టార్ హీరోకి గెస్ట్ రోల్ ఇవ్వాలని ప్లాన్ చేసాడు. పాన్ ఇండియా లెవెల్ నటులను తీసుకుని సినిమాకు హైప్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు ప్రశాంత్.
Also Read : ఏపీలో ఇసుక తలనొప్పులు ఇంకెన్నాళ్లు బాబుగారు..?
హనుమాన్ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ హిట్ కొట్టిన ప్రశాంత్… ఇప్పుడు మోక్షజ్ఞ కోసం బలమైన కథతో పాటు స్టార్ నటులు ఉండేలా ప్లాన్ చేసి… హైప్ క్రియేట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక బాలయ్యను ఈ సినిమాలో సూపర్ హీరోగా చూపించే ప్లాన్ లో ఉన్నట్టు రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను తీసుకుంటారని టాక్. ఒక హీరోయిన్ గా శ్రీదేవి చిన్న కుమార్తె కుషీ కపూర్ ఉండే ఛాన్స్ ఉంది. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా మాత్రం పాన్ ఇండియా సెన్సేషన్ అవుతోంది.