ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణం విషయంలో దర్యాప్తు అధికారులు ఎప్పుడు ఏ సంచలనం నమోదు చేస్తారనేది ఆసక్తిగా మారింది. లిక్కర్ స్కాం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపధ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరిగిందనే ఆరోపణల నేపధ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం నియమించింది. గత నెలలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారనేది ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.
Also Read : తప్పు చేసిన వాడ్ని వదలను.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
ఇటీవల లిక్కర్ స్కాంలో దిలీప్ సహా పలువురిని అరెస్ట్ చేయగా.. వైఎస్ జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్ భారతీ వ్యాపార వ్యవహారాలను చూసే.. బాలాజీ గోవిందప్పలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వారికి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. వాళ్ళు హైకోర్ట్ కు వెళ్ళగా.. కోర్ట్ కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇక సుప్రీం కోర్ట్ సైతం వారిని అరెస్ట్ చేయవచ్చు అంటూ సిట్ కు స్పష్టం చేసింది.
Also Read : స్కాంలో లేము.. కేసిరెడ్డి టు కృష్ణమోహన్ రెడ్డి.. ఎవరిని ఇరికిస్తున్నట్టు..?
ఈ తరుణంలో ఈ ముగ్గురి కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు అధికారులు. తాజాగా ఈ కేసులో కీలక నిందితుడుగా భావిస్తున్న బాలాజీ గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో మైసూర్లో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. అక్కడి నుంచి విజయవాడ తరలిస్తున్నారు. వైయస్ భారతి రెడ్డి కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప.. ఆమె వ్యాపార వ్యవహారాలను చూస్తున్నారు. ఇక మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేసే సంకేతాలు కనపడుతున్నాయి.