ఆస్ట్రేలియా పర్యటనకు విదేశీ ఆటగాళ్ళు వెళ్తుంటే… ఓ రకమైన భయం ఉంటుంది. అక్కడి బౌన్సీ పిచ్ లపై ఆడటం అనేది అంత సులువు కాదు. బంతి అనూహ్యంగా బౌన్స్ కావడం… ఎటు స్వింగ్ అవుతుందో అర్ధం కాని పరిస్థితి… దానికి తోడు బంతిని ప్రభావితం చేసే గాలి బ్యాట్స్ మెన్ కి ప్రధాన శత్రువులా ఉంటుంది. తమ టాలెంట్ కంటే… తమ పిచ్ లను వాడుకోవడంలో ఆసీస్ బౌలర్లు దిట్ట. అందుకే… సేనా పిచ్ లు కాకుండా విదేశీ మైదానాల్లో ఆస్ట్రేలియా ప్రభావం అంతగా ఉండదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పిచ్ లపై మాత్రమే వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
Also Read : బోరుగడ్డ దెబ్బకు జీవితం నాశనం చేసుకున్న మరో ఖాకీ
అలాంటి ఆస్ట్రేలియా జట్టు… ఇప్పుడు ఓ కుర్ర బ్యాటర్ కు ఫ్యాంట్ లు తడుపుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు వీవీఎస్ లక్ష్మణ్, హషీం ఆమ్లా, జొ రూట్ వంటి ఆటగాళ్లకు భయపడిన ఆస్ట్రేలియా బౌలర్లు ఇప్పుడు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు వింటే చాలు భయపడుతున్నారు. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనలలో అతని ఆట తీరు ఆస్ట్రేలియాను అలా భయపెట్టింది. స్టార్క్, కమ్మిన్స్ వంటి దిగ్గజ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు పంత్. పంత్ ఫాంలో ఉన్నాడో లేదో కూడా క్లారిటీ ఉండదు. అతని నుంచి ఊహించని భారీ ఇన్నింగ్స్ లు ఉంటాయి.
Also Read : సంక్రాతి నుంచి బాబు ‘మన్ కీ బాత్’
అర్ధ సెంచరీ చేసినా సరే అది ఖచ్చితంగా ప్రత్యర్ధికి ఏదోక రూపంలో నష్టమే చేకూరుస్తుంది. అందుకే ఇప్పుడు పంత్ ను ఎదుర్కోవడానికి ఆస్ట్రేలియా బౌలర్లు… అతని వీడియోలు చూస్తున్నారు. అతని వీక్నెస్ పై ఫోకస్ చేయడానికి రెడీ అయ్యారు. ఏ ఏరియాలో బంతి విసిరితే పంత్ ఇబ్బంది పడతాడో… వీడియోలు చూసి ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆ జట్టు బౌలింగ్ కోచ్ డానియల్ వెటోరి. పంత్ కు బౌన్సీ పిచ్ లు అంటే పండుగే. స్పిన్ పిచ్ లపై కూడా స్వేచ్చగా ఆడుతూ ఉంటాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మైదానాలు పంత్ కు కొట్టిన పిండి. అందుకే ఇప్పుడు పంత్ కోసం వ్యూహాలు సిద్దం చేస్తోంది ఆస్ట్రేలియా.