వైఎస్ జగన్ ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడిన అరబిందోపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేసింది. కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరబిందో లాగేసుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది. అరబిందో డైరెక్టర్లు, ఆరో ఇన్‌ఫ్రా సంస్థకు సిఐడీ తాజాగా లేఖలు రాసింది. వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడి 2021లో కేవీ రావు నుంచి 41.12 శాతం వాటాలు లాక్కున్నారని, దానిపై వచ్చిన లాభాలు, డివిడెండ్లు పంచుకోవడానికి వీల్లేదని ఆ లేఖలో హెచ్చరికలు చేసింది.
Also Read: దిల్ రాజు టార్గెట్ పుష్ప.. రామ్ చరణ్ వర్కౌట్ అదే
అలా పంచుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐడీ ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆ లేఖలో స్పష్టం చేసారు. డివిడెంట్ కింద రూ.102కోట్లు నాలుగేళ్లలో తీసుకున్నారని గుర్తించారు. కేవీ రావు నుంచి యాజమాన్య హక్కులు లాక్కున్న దానిపై మేం విచారణ జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి మీరు అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించారట. అధికారం ఉందని ప్రభుత్వ రంగ సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం సేకరించారు.

దానిపై విచారణ జరుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. పూర్తి హక్కులున్న కేవీ రావును బెదిరించినట్లు ఆయన చెబుతున్న అంశాలపై సమాచారం సేకరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒక్క అడుగు ముందుకేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు చేసారు. ఇప్పటివరకు కూడా పూర్తి హక్కులు తనకే ఉన్నట్లు కేవీ రావు ఆధారాలు సమర్పించారట. అలాగే మీకు ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించండి.. దానిపైనా న్యాయబద్ధంగా విచారణ చేపడతాం.. బాధితుడిగా ఉన్న కేవీరావు హక్కులను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉందిని సిఐడి చీఫ్ ఓ లేఖ రాసారు. అయితే ఈ విచారణకు విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి డుమ్మా కొడుతున్నారు.
Also Read: కేటిఆర్ పక్కాగా బుక్ అయ్యాడు.. ఏసీబీ సంచలన అడుగులు
సిఐడి విచారణకి మరోసారి డుమ్మా కొట్టారు అరబిందో చైర్మన్ శరత్ చంద్రారెడ్డి. కాకినాడ పోర్టు బలవంతపు బదలాయింపులపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసి ఆయనను విచారించాలని భావిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరుకావాలని నోటీసు జారీ చేసింది ఏపీ సిఐడి. 24 ను విచారణకు హాజరవుతానని గతంలో సిఐడికి సమాచారం ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి తాను అందుబాటులో లేనని మరొక వాయిదా కావాలని శరత్ చంద్ర రెడ్డి కోరడం గమనార్హం.