Tuesday, October 28, 2025 03:48 AM
Tuesday, October 28, 2025 03:48 AM
roots

చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు భయమా..?

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటారనేది అందరికీ అవగాహన ఉంది. అవసరమైన సమయంలో విమర్శలు చేయకపోవడం, పరోక్షంగా రాజకీయ ప్రత్యర్థులకు సహకరించడం వంటివి వీరిలో ఎక్కువ కనపడతాయని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వాతావరణం అలాగే కనపడుతుంది. మరి వైసీపీకి భయపడుతున్నారా లేదంటే వేరే ఏదైనా కారణమా తెలియదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం బయటకు రావడానికి గాని మీడియా సమావేశాలు నిర్వహించడానికి గానీ ఇష్టపడటం లేదు.

Also Read : పవన్ సంచలన నిర్ణయం.. రెండు రాష్ట్రాల్లో జనసేన సర్వేలు

ఇప్పుడు చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా సీఎం సొంత జిల్లా. అక్కడ మాజీ మంత్రి ఆర్కే రోజా రెచ్చిపోతున్నారు. పదేపదే మీడియా ముందుకు రావడం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం వంటివి చేస్తున్నారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్నారు రోజా. ఇప్పుడు నిదానంగా మళ్ళీ విమర్శల వేడి పెంచే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటుగా మంత్రి నారా లోకేష్.. సహా పలువురు టిడిపి నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Also Read : బన్నీ టార్గెట్ వేరే లెవెల్.. మరీ ఈ రేంజ్ లోనా..?

కానీ చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు ఒక్కరుంటే ఒకరు కూడా మీడియం ముందుకు వచ్చి మాట్లాడటం లేదు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటుగా సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. మద్యం కుంభకోణం విషయంలో కూడా ప్రస్తుత ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా మీడియా ముందుకు రావడం లేదు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ విషయంలో సైతం వారు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యంగా రోజా కాస్త మితిమీరి ఆరోపణలు చేస్తున్న.. సాక్షి ఛానల్ లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని శాపాలు పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నా సరే.. గతంలో మాదిరిగా విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నా జిల్లా ఎమ్మెల్యేలు మౌనంగానే ఉంటున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడడమే మినహా మిగిలిన వారు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్