Friday, August 29, 2025 10:41 PM
Friday, August 29, 2025 10:41 PM
roots

బెజవాడలో ఆపిల్ స్టోర్..? టెక్ దిగ్గజం కీలక నిర్ణయం..!

భారత్ లో పెట్టుబడులు పెట్టే విషయంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ వెనకడుగు వేయడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి ఏ విధమైన ఒత్తిడి ఎదురైనా సరే ఆపిల్ మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల బెంగళూరులోని ఆపిల్ మొబైల్ తయారి ప్లాంట్ లో తమ రాబోయే ఐఫోన్ 17 సీరీస్ మోడల్స్ తయారి మొత్తం మొదలుపెట్టింది. ఇక ఆపిల్ స్టోర్ లను కూడా విస్తరించే ఆలోచన చేస్తోంది. దేశంలో ఆపిల్ వినియోగదారులు క్రమంగా పెరగడంతో సంస్థ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది.

Also Read : ట్రంప్ మరిన్ని సుంకాలు..? బుజ్జగిస్తోన్న ఆయిల్ కంపెనీలు..?

ఇప్పటి వరకు దేశంలో 3 స్టోర్ లను ఓపెన్ చేసింది సంస్థ. త్వరలో మరో రెండు స్టోర్ లకు ప్లాన్ చేస్తోంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరులో స్టోర్ లు ఓపెన్ చేసింది. ఇప్పుడు పూణేలో ఓపెన్ చేయనుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో స్టోర్ ఓపెన్ చేసేందుకు సిద్దమవుతోంది. ఎంజీ రోడ్ లో ఇప్పటికే ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ను కూడా ఆపిల్ సంస్థ ప్రతినిధులు సందర్శించారు. సుమారు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని సమాచారం.

Also Read : జగన్ తిరుమలకు రావొద్దు.. వైసీపీలో అంతర్గత తిరుగుబాటు

దాదాపు ముంబై స్టోర్ పరిమాణంలోనే దీనిని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. బెంగళూరులో ఆపిల్ స్టోర్ ను సెప్టెంబర్ 2 న ప్రారంభిస్తారు. ఆ తర్వాత పూణే, అనంతరం విజయవాడలో స్టోర్ ఓపెన్ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చ్ లేదా మే నెలలో ఇక్కడ స్టోర్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. తమ 17 సీరీస్ మోడల్స్ ను ఆపిల్ పూణేలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి ఆపిల్ ఫోన్ లను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఆపిల్ ఉన్నట్టు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్