Friday, September 12, 2025 11:10 PM
Friday, September 12, 2025 11:10 PM
roots

ఘనంగా ఏపి కాకతీయ సేవా సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక

చెప్పేదొకటి చేసేదొకటిగా కాకుండా నిజాయితీగా మనకు చేతనైనంత వరకు సమాజానికి సేవ చేసి చూపిద్దామని ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య (APKSS) నూతన అధ్యక్షులు శ్రీ వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ అన్నారు. ఈరోజు మంగళగిరి రాయల్ బ్యాంకట్ హాల్ లో జరిగిన రాష్ట్ర సమాఖ్య సర్వసభ్య సమావేశంలో నూతన పాలకవర్గ అధ్యక్షులుగా ఎంపికైన తదుపరి శ్రీ గోపాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఎంత మంచి చేసినా అసూయతో రాళ్లు వేసే వాళ్ళు ఎప్పుడు వేస్తూనే ఉంటారని కుక్కలు మొరిగాయని అనుకొని నిజాయితీగా, ధైర్యంగా ముందుకు అడుగేయాలే గాని ఎట్టి పరిస్థితులలో కూడా బ్యాలెన్స్ తప్పి మాట్లాడకూడదని అన్నారు.

మనం చేసేది మంచిగా సమాజాభివృద్ధికి తోడ్పడాలని అలాగే మన మీద ఆధారపడిన ఇతర కులాలతో కలిసి మెలిసి వారి అభివృద్ధికి కూడా మనకు చేతనైనంత సహాయం చేయాలని అన్నారు. మన వాళ్ళ విషయంలో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అన్యాయం జరిగిన సందర్భం ఏదైనా తన దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో మాట్లాడి పరిష్కరిద్దామని, సంఘ సభ్యుల అందరి సహకారంతో నాకున్న పరిచయాలన్నీ ఉపయోగించి సంస్థకు శాశ్వత భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని నాపై మీరు పెట్టిన ఈ బాధ్యతతో నాకు సరిపడా పని దొరికిందని భావిస్తున్నానని శ్రీ గోపాలక్రిష్ణ అన్నారు.

ప్రధాన కార్యదర్శి శ్రీ బెజవాడ వెంకట్రావు మాట్లాడుతూ ఇప్పటివరకు మనవాళ్ళు ఉన్న ఎక్కువ ప్రాంతాలకు వెళ్లి సంఘాల ఏర్పాటుకు కృషి చేశామని, ఆయా సంఘాలను సేవా కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో 13 జిల్లాలను 6 జోన్లుగా.. ప్రతి జిల్లా నుంచి యావరేజ్ గా ముగ్గురికి తగ్గకుండా ఉపాధ్యక్షులు 6, కార్యదర్శులు 6, సంయుక్త కార్యదర్శులు 6, ఈసీ మెంబర్లు 6, రాష్ట్రస్థాయి అనుబంధ సంఘాల కార్యదర్శులు 11 మంది కాగా మొత్తం 39 మందితో అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా కమిటీలోకి తీసుకుంటున్నామని.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రాష్ట్ర సమాఖ్య అభివృద్ధికి శక్తి మేరకు కృషి చేయాలని ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read: పోయిరా నేస్తమా… రాజకీయ గురువుకు కన్నీటి వీడ్కోలు..!

శ్రీ దూదిపల్లి వెంకటరమణ – నంద్యాల, శ్రీ నన్నపనేని నాగేశ్వరరావు – విజయవాడ మరియు శ్రీ కాటూరి వివి ప్రసాద్ – కాకినాడ లు ఎన్నికల పరిశీలకులుగా కొత్త కమిటీకి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సమావేశానికి హాజరైన సభ్యులందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆ తదుపరి ఈ క్రింది సభ్యులతో పూర్తిస్థాయి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గౌరవ అధ్యక్ష్యులుగా శ్రీ రామినేని కృష్ణమూర్తి నాయుడు (తిరుపతి), వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీ మురకొండ బోసుబాబు (ఇంకొల్లు), ఉపాధ్యక్షులుగా శ్రీ కొంకా ఉమాపతి నాయుడు (అధోని), శ్రీ చిగురుపాటి నాగరాజు (విజయవాడ), శ్రీ వీరమాచినేని ప్రభాకరావు (ఏలూరు), శ్రీ పులివర్తి మాల్యాద్రి నాయుడు (నెల్లూరు), శ్రీ ముత్తవరపు సురేష్ బాబు (ఎడ్లపాడు), ప్రధాన కార్యదర్శిగా శ్రీ బెజవాడ వెంకట్రావు (ఒంగోలు), కార్యదర్శులుగా శ్రీ వెలగా కోటేశ్వరరావు (యర్రగొండపాలెం), శ్రీ తమ్మినేని రమేష్ (గుంతకల్లు), శ్రీ కర్నాటి శ్రీనివాస చక్రవర్తి (విస్సన్నపేట), శ్రీ మేడసాని చెన్నకేశవ దుర్గాప్రసాద్ (కర్నూలు), రెడ్డి విజయశ్రీ వెంకటేశ్వరరావు (శ్రీకాకుళం), శ్రీ మాకినేని మాల్యాద్రి నాయుడు ( కావలి) ఎంపికయ్యారు.

సంయుక్త కార్యదర్శులుగా శ్రీ పర్చూరి శ్రీనివాసరావు (ఆళ్లగడ్డ), శ్రీ తరిగోపుల లక్ష్మీనారాయణ (రాజంపేట), శ్రీ బెజవాడ రమేష్ నాయుడు (తిరుపతి), శ్రీ వేలిచేటి జ్యోతిప్రసాద్ (విజయనగరం), కోశాధికారిగా శ్రీ కొర్రపాటి అయోధ్య రామారావు (తాడేపల్లి గూడెం) లను ఎంపిక చేసారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గా శ్రీ బూరుగపల్లి వెంగళరావు (తాడేపల్లి గూడెం), శ్రీ మేదరమెట్ల రాజేష్( రాజాం), శ్రీ వసంత కృష్ణ (విశాఖపట్నం), శ్రీ ధనుంజయ నాయుడు చిత్తూరు, శ్రీ కూచిపూడి వెంకటేశ్వర్లు (మార్కాపూర్) లు ఎంపిక అయ్యారు.

Also Read: జగన్ కు టిట్ ఫర్ టాట్… బాబు వ్యూహం భేష్

ఇంకా రాష్ట్ర కార్యదర్శులుగా వ్యవసాయ విభాగానికి మాలెంపాటి కృష్ణారావు (ఒంగోలు), మెడికల్ & హెల్త్ విభాగానికి కాటూరి వి.వి.ప్రసాద్ (కాకినాడ), మీడియా విభాగానికి దండా గోపి (చిలకలూరిపేట), లీగల్ విభాగానికి నల్లమోతు రామకోటేశ్వరరావు (వినుకొండ), ఎంప్లాయిస్ విభాగానికి ధూదిపల్లి వెంకటరమణ (నంధ్యాల), NRI & సోషల్ మీడియా విభాగానికి గడ్డం సతీష్ కుమార్ (పర్చూరు), వాణిజ్య విభాగానికి శ్రీ పిన్నమనేని వెంకటేశ్వరరావు (విశాఖపట్నం), మహిళా విభాగానికి శ్రీమతి కనుమూరి రాజ్యలక్ష్మి (నరసరావుపేట) యూత్ విభాగానికి శ్రీ సురేష్ నాయుడు (పుట్టపర్తి)లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కార్యదర్శి శ్రీ వెలగా కోటేశ్వరరావు వందన సమర్పణతో కార్యక్రమము ముగిసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్