ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. వైసీపీకి రాజీనామా చేస్తూ… తమ రాజ్యసభ పదవులకు కూడా రాజీనామాలు చేసిన మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనితో ఈ మూడు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారు అనేది కీలకంగా మారింది. బిజేపి నుంచి… రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ పదవి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనకు సీఎంగా పని చేసిన అనుభవం కూడా ఉంది.
Also Read : జేసి ఫ్యామిలీని పోలీసులు ఇంకా వేధిస్తున్నారా…?
దీనితో ఆయన ఢిల్లీలో ఉంటే బాగుంటుంది అనే భావనలో చంద్రబాబు ఉన్నారు. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక జనసేన నుంచి నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన పార్టీ కోసం నాగబాబు కష్టపడ్డారు. నర్సాపురం ఎంపీగా కూడా గతంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు రాజ్యసభ ఇచ్చి గౌరవించాలి అని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి నాగబాబు కూడా సిద్దంగా ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పెద్ద సోదరుడు చిరంజీవి రాజ్యసభ ఎంపీగా ఉంటూ కేంద్ర మంత్రిగా కూడా చేశారు. చిన్న సోదరుడు పవన్ ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
Also Read :ఆ 5 ఏళ్ళు మర్చిపోను.. చంద్రబాబు సంచలన కామెంట్స్
ఇక టీడీపీ నుంచి కడప పార్లమెంట్ అధ్యక్షులు… రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వాలని భావిస్తున్నారు. ఆయన భార్య మాధవి రెడ్డి కడప ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా ఈ మూడు స్థానాలకు అభ్యర్ధులను దాదాపుగా ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీలతో సంబంధం లేని వ్యక్తిని కూడా రాజ్యసభకు పంపాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై ఎన్డియే పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటాయి అనేది చూడాలి. మూడో స్థానం కోసం టిడిపి నుంచి పోటీ తీవ్రంగా ఉంది. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దేవినేని ఉమా కి కూడా అవకాశం రావొచ్చు. గతంలో ఎంపీగా ఉంది ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న టిడిపి నాయకుడికి కూడా ఈ అవకాశం ఉండొచ్చని తెలుస్తుంది.