Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

ఆపరేషన్ దుబాయ్.. లిక్కర్ కేసులో కీలక అడుగు..!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం విషయంలో సిట్ అధికారులు.. నిందితుల వేటలో కీలక అడుగులు వేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కాం కు తెలంగాణాలో గత ప్రభుత్వానికి కూడా లింక్ ఉందనే అనుమానాలపై విచారణ చేసిన అధికారులు కొన్ని కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకునే ముందు పక్కా ఆధారాలను సేకరించిన అధికారులు, న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించారు.

Also Read : ఒక్క కామెంట్‌తో ఇండియాను ఫిదా చేసిన లోకేష్

ఇక లిక్కర్ స్కాంలో దుబాయ్ లో కూడా డెన్ ఉన్నట్టు తేల్చారు అధికారులు. దీనితో విదేశాల్లో ఉన్న కీలక నిందితుల కోసం సిట్ వేట మొదలుపెట్టారు. దుబాయ్, థాయ్‌ల్యాండ్‌లో 8 మంది ఉన్నట్లు గుర్తించారు. దుబాయ్ పరారైన కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రద్యుమ్న కోసం వేట కొనసాగుతోంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న అవినాష్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి థాయ్‌ల్యాండ్‌ పరారు అయ్యారు. ఈ కేసు నమోదు తర్వాత విదేశాలకు పారిపోయిన నిందితులు.. అక్కడే తల దాచుకుంటున్నారు అని తేల్చారు.

Also Read : దుబాయ్ ను చూస్తే అసూయ.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్

నిందితులకు రెడ్ కార్నర్ నోటీసుల జారీకి రంగం సిద్ధం చేస్తోంది సిట్. ఇంటర్‌పోల్ ద్వారా నిందితులకు రెడ్‌కార్నర్ నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు. నిందితులను భారత్‌కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విదేశాంగశాఖకు ఏపీ సిట్ అధికారులు లేఖ రాసారు. ఈ వ్యవహారంలో త్వరలోనే మాజీ మంత్రి నారాయణ స్వామిని కూడా విచారించే అవకాశం ఉంది. ఆయనతో పాటుగా పలువురు అధికారులపై కూడా గురి పెట్టారు. మిథున్ రెడ్డిని త్వరలో కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్