Friday, September 12, 2025 08:54 PM
Friday, September 12, 2025 08:54 PM
roots

వంశీకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్ట్

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి విషయంలో పోలీసులు ఎప్పటికైనా చర్యలు తీసుకుంటారు అని తెలుగుదేశం క్యాడర్ ఎదురు చూస్తూ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి అప్పట్లో ఒక సంచలనమైంది ఆ దాడి తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులను కూడా ఇళ్లకు వెళ్లి మరి అరెస్టులు చేశారు. అయితే టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దాడి విషయంలో ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదని చెప్పాలి.

Also Read : రెచ్చిపోతున్న వెంకట్రామిరెడ్డి.. బాబు సర్కార్ ని అవమానించడమేనా?

ఈ దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళందరిపై చర్యలు కచ్చితంగా తీసుకుంటారని చాలామంది ఎదురు చూశారు. ముఖ్యంగా వల్లభనేని వంశీని కచ్చితంగా అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో ముందడుగులు పడుతున్నాయి. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులను నిందితులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో దాఖలైన 17 ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది.

Also Read : వైసీపీ లో శ్యామల డామినేషన్.. మండిపడుతున్న నాయకులు

టిడిపి కార్యాలయం పై దాడి కేసులో మొత్తం 89 మందిని ఇప్పటివరకు నిందితులుగా చేర్చారు పోలీసులు. ఇదే కేసులో 71 గా వల్లభనేని వంశీ ఉన్నారు. అరెస్టు భయంతో వీళ్ళందరూ కోర్టు మెట్లు తొక్కగా ఇప్పుడు కోర్టు షాక్ ఇచ్చింది. తాజాగా 17 బెయిల్ పెట్టేసి కోర్టు డిస్మిస్ చేయడంతో కచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం వల్లభనేని వంశీ వంశీ ఎక్కడున్నారు ఏంటి అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. మొన్నామధ్య ఆయనను అరెస్ట్ చేస్తారని మీడియాలో హడావుడి జరిగింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్