Friday, September 12, 2025 03:26 PM
Friday, September 12, 2025 03:26 PM
roots

పోలవరం విషయంలో కీలక ముందడుగు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గత రాష్ట్ర ప్రభుత్వం అయిదేళ్ళ నుంచి నిర్లక్ష్యం వహించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణంపై దూకుడు పెంచుతోంది. నేడు పోలవరానికి విదేశీ నిపుణుల బృందం రానుంది. ఈ పర్యటనలో పలు కీలక అంశాలను పరిశీలిస్తారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అంశాలు, సకాలంలో నిర్మించేందుకు ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను పరిష్కరించే నిమిత్తం విదేశీ నిపుణుల బృందం మరోసారి పోలవరం చేరుకొనుంది.

Also Read : కేబినేట్ లో నిర్ణయాలు ఇవే, అక్రమార్కులకు మూడినట్టే

కొత్త డయాఫ్రం వాల్ తో పాటు సమాంతరంగా ఈసీ ఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలపై అధికారులతో చర్చిస్తారు. అలాగే ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నుంచి సీపేజ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమీక్షా సమావేశం జరగనుంది. ఈ మేరకు డ్యాంల భద్రత, నిర్మాణం, జియోటెక్నికల్ అంశాల్లో విశేష అనుభవమున్న డేవిడ్ బి. పాల్, రిచర్డ్ డోన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్బెర్గర్లతో కూడిన విదేశీ బృందం రానుంది. వారితో పాటు ప్రాజెక్టు డిజైనర్ పాత్ర పోషిస్తున్న అఫ్రి కన్సల్టెన్సీ ప్రతినిధులు, పర్యవేక్షించే ఇంజినీర్ల బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటుంది.

Also Read : అయ్యో పాపం… జగన్ పరిస్థితి ఇలా అయ్యింది ఏమిటీ…!

7న కొత్తడయా ఫ్రంవాల్ నిర్మాణం, డిజైన్లపై 8న ప్రధా నడ్యాం నిర్మాణంపై కీలక చర్చ జరపనున్నారు. 9న ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత నియంత్రణ అంశాలపై అధికారులతో సమీక్షనున్నారు. పోలవరం పనులు కొలిక్కి తెచ్చేందుకు ఇప్పటికే సి ఏం చంద్రబాబు తో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు అధికారులు తీసుకున్నారు. మరి కొన్ని అంశాలపై స్పష్టత కోసం పోలవరంలో నాలుగు రోజుల భేటీ . డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్ ఓ కొల్కికి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్