ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ ఒక్కో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్ళు కాస్త నిదానంగా ఉన్నట్టు అనిపించినా, ఇప్పుడు మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఇబ్బంది పెట్టాలనే అధికారుల విషయంలో చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఐపిఎస్ అధికారులు గతంలో తప్పులు చేస్తే వాళ్ళపై కూడా చర్యలు తీవ్రంగానే ఉంటున్నాయి. ఇటీవల హీరోయిన్ కేసు వ్యవహారంతో అది ప్రూవ్ అయింది అనే చెప్పాలి. ప్రస్తుతం రఘురామ కృష్ణం రాజు కేసు వ్యవహారం నడుస్తోంది.
అలాగే మహిళా కమీషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినా కూడా ఇంకా మహిళా కమీషన్ చైర్మన్ ను మార్చకపోవడం ఏంటీ అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. మహిళా కమీషన్ ద్వారా జగన్ ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నాడు అని ఆమె పదవి కాలం ముగిసినా కూడా ఇంకా పదవిలోనే ఉన్నారని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. మహిళా కమిషన్ పై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రస్తుతం సిట్టింగ్ చైర్ పర్సన్ గజల వెంకట లక్ష్మి పదవీ కాలం ముగిసినట్టు మెమో జారీ చేసింది.
Read Also : లడ్డు పాపంలో ఆ నలుగురూ రెడ్లే…?
2024 ఆగస్టు 25 తేదీ నాటికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఆమె పదవీకాలం ముగిసినట్టు స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి మేమో జారీ చేసారు. గతంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయటంతో ఆ స్థానంలో గజ్జల వెంకట లక్ష్మిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నియమించింది. వాసిరెడ్డి పద్మ రాజీనామా అనంతరం బాధ్యతలు చేపట్టిన గజల వెంకట లక్ష్మి పదవీకాలం కూడా ఆగస్టు 25 తేదీ తర్వాత ముగిసినట్టు మోమోలో స్పష్టం చేసింది ప్రభుత్వం. త్వరలోనే మహిళా కమీషన్ కు చైర్మన్ ను నియమించే అవకాశం ఉంది.