Saturday, September 13, 2025 01:03 AM
Saturday, September 13, 2025 01:03 AM
roots

ఆ ఇద్దరూ చేసిన పాపం ఏంటీ…?

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్ట్ లు, కార్పోరేషన్ చైర్మన్ పదవులను ఖరారు చేసింది. దాదాపుగా ఈ ప్రక్రియను పూర్తి చేసింది. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్, విప్ ల పదవులను కూడా ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక డిప్యూటి స్పీకర్ గా రఘురామ కృష్ణం రాజును ఎంపిక చేసింది సర్కార్. ఇదిలా ఉంచితే ఓ ఇద్దరికీ మాత్రం ఈ సారి కూడా పదవులు రాకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ధూళిపాళ్ళ నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలకు ఏ పదవులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయలేదు.

Also Read :టీటీడీ సిఫార్సు లేఖలపై గుడ్‌ న్యూస్‌…!

ఇద్దరూ సీనియర్ ఎమ్మెల్యేలు అయినా సరే వారికి మాత్రం పదవులు దక్కడం లేదు. గత ప్రభుత్వంలో ఈ ఇద్దరూ మంత్రి పదవి కోసం ఎదురు చూసారు. గోరంట్ల పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అందరిలో ఆయనే సీనియర్ నేతగా ఉన్నారు. ప్రజాదరణ కూడా బలంగా ఉన్న నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించారు గోరంట్ల. కాని కేబినేట్ ర్యాంక్ మాత్రం ఆయనకు ఓ కలలా మిగిలిపోయింది. ఇక ధూళిపాళ్ళ విషయానికి వస్తే… గత ప్రభుత్వం ఎన్ని విధాలుగా వేధించినా సరే ఆయన తట్టుకుని నిలబడ్డారు.

Also Read :మరోసారి చంద్రబాబు మాస్ వార్నింగ్‌…!

సంగం డైరీ వ్యవహారాల్లో ప్రభుత్వం తల దూర్చినా సరే నరేంద్ర కుమార్ మాత్రం వెనక్కు తగ్గలేదు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయన ఘన విజయం సాధించారు. 94 నుంచి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాని మంత్రి పదవి మాత్రం దక్కలేదు. కొత్త వారికి, తొలిసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయిన వారికి కీలక పదవులు వచ్చినా సరే నరేంద్రకు మాత్రం పదవి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ కోసం జైలు జీవితం కూడా గడిపారు నరేంద్ర. పార్టీ కోసం ఇంత కష్టపడిన నేతలకు పదవులు రాకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్