Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

వైసీపీ పై బాబు ఫోకస్.. రాజీనామా బాటలో కీలక నాయకులు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక, కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన వైసీపీని మరింతగా దెబ్బతీసేందుకు టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే అనేకమంది పేరున్న నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ఇంకా అనేక మంది నేతలు టిడిపి, జనసేన, బిజెపిలలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంతమంది రాజ్యసభ సభ్యులు , ఎమ్మెల్సీలు పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేయగా, మరికొంతమంది అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా అందుతున్న సంకేతాలు వైసీపీలో కలవరం పుట్టిస్తున్నాయి.

వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. దీని కారణంగానే కేంద్రంలో ఉన్న బిజెపి, వైసిపి విషయంలో కొంత సానుకూల వైఖరి అవలంబిస్తూ వస్తోంది. దీంతో ఢిల్లీ స్థాయిలో వైసీపీ ప్రభావం బాగా తగ్గించాలనే ఆలోచనకు వచ్చిన కూటమి పార్టీలు ఆపరేషన్ వైసీపీ ని ప్రారంభించినట్లుగా అర్థం అవుతుంది. ముఖ్యంగా ఈ విషయంలో టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాజ్యసభలో వైసిపి బలాన్ని బాగా తగ్గించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారని తెలుస్తుంది. అందుకే ఆ పార్టీ నుంచి వలసలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు.

Read Also : ఇదేనా ఎన్టీఆర్ పై టిడిపి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి?

అయితే అలా వచ్చి చేరిన నేతలతో నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు ఏర్పడతాయని, అంతర్గత కుమ్ములాటలు మొదలవుతాయనే భయము అందరిలోనూ ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, అందుకే బలమైన నేతలను ముందుగా పార్టీలో చేర్చుకుని వారికి టికెట్ హామీని సైతం ముందుగానే ఇవ్వనున్నట్టు సమాచారం. కాకపోతే నామినేటెడ్ పోస్టులు విషయంలో మాత్రం వైసీపీ నుంచి వచ్చి చేరిన వారికి కాకుండా, ముందు నుంచి పార్టీలో కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలని భావిస్తున్నారట.

ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు వైసీపీకి తమ పదవులకు రాజీనామా చేశారు.రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు తో పాటు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ రాజీనామా చేశారు. ఇంకా అనేకమంది రాజీనామా చేసి టిడిపి, జనసేన, బిజెపిలలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్