Friday, September 12, 2025 11:24 PM
Friday, September 12, 2025 11:24 PM
roots

ఎమ్మెల్యేలకు బాబు షాక్..!

సొంత పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు షాక్ ఇస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల్లో అలసత్వం పెరిగిందనే మాట బాగా వినిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ నేతలు పదే పదే ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇసుక, మద్యం వ్యాపారాల్లో టీడీపీ నేతలపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్వయంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోసారి ఈ తరహా ఆరోపణలు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కూడా. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. తొలి అడుగు పేరుతో ప్రభుత్వం ఏడాది కాలంలో నిర్వహించిన పనులను ప్రజలకు లెక్కలతో సహా వివరించాలని చంద్రబాబు ఆదేశించారు.

Also Read : జగన్ కు అల్జీమర్స్.. ఓ ఆట ఆడుకుంటున్న సోషల్ మీడియా..!

అధినేత ఆదేశాలతో టీడీపీ నేతలంతా నెల రోజుల క్రితమే తొలి అడుగు కార్యక్రమాన్ని తమ తమ నియోజకవర్గాల్లో ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ గడప గడపకు వెళ్తూ ప్రజలకు కూటమి సర్కార్ పాలనలో జరిగిన మేలును వివరిస్తున్నారు కూడా. ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారంటీకి కౌంటర్‌గా బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ అని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించడంలో వైసీపీ విఫలమైందనే మాట బాగా వినిపిస్తోంది. వైసీపీ నేతలు ఎక్కడా కనిపించటం లేదు. ఒకరిద్దరు మినహా.. వైసీపీ నేతలు, కార్యకర్తలకే కనిపించటం లేదు. వరుస కేసులతో కొందరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. కొంతమంది నేతలు.. ఇప్పటి నుంచి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకని సైలెంట్‌గా ఉన్నారు.

అయితే ఒకరిద్దరు నేతలు తప్ప.. టీడీపీలో కూడా చాలా మంది తొలి అడుగు కార్యక్రమం నిర్వహించడంలో అలసత్వం చూపిస్తున్నారనే మాట నేరుగా అధినేతకు చేరింది. స్వయంగా సీఎం స్థాయిలో ఆదేశాలు జారీ చేసినా కూడా వాటిని నేతలు బేఖాతరు చేస్తున్నారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు తొలి అడుగు కార్యక్రమంలో మొక్కుబడిగా హాజరై.. అనుకూల మీడియాలో కవర్ అయితే చాలు.. పార్టీ దృష్టికి చేరుతుందనే ధీమాలో ఉన్నారు. దీనిపై కింది స్థాయి కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో.. పార్టీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగారు.

Also Read : నేను రెడీగా ఉన్నా.. మోడీ సంచలన కామెంట్స్

తొలి అడుగు కార్యక్రమంపై ఐవీఆర్ఎస్ సర్వేకు చంద్రబాబు ప్లాన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఐవీఆర్ఎస్ ఫోన్ చేస్తున్నారు. మీ నియోజకవర్గం నేతలు ఇంటికి వచ్చారా.. కరపత్రం ఇచ్చారా.. తొలి అడుగు కరపత్రం అందిందా.. ప్రజాప్రతినిధులు ఇంటికి వచ్చారా… లేక కరపత్రం పంపించారా.. అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ప్రశ్నకు ఆప్షన్ ఇస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం.. ఏ ప్రజాప్రతినిధి తమ గడపకు రాలేదనే జవాబు చెబుతున్నారు. కూటమి సర్కార్ అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయని.. కానీ తొలి అడుగులో భాగంగా ఎవరు తమ ఇంటికి రాలేదనే జవాబే ఎక్కువగా వస్తుంది. ఈ వివరాలు సేకరిస్తున్న చంద్రబాబు.. ఆయా నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు పార్టీ పెద్దలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్