Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

ర్యాంకులతో కూటమికి కొత్త తలనొప్పులు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు. కానీ పాత కాలపు విధానాలతో ప్రజల్లో పలుచన అవుతుందనే మాట బలంగా వినిపిస్తోంది. మరోవైపు పూర్తిగా జవసత్వాలు కోల్పోయిన వైసీపీకి తిరిగి ఊపిరిలూదుతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. నాటు భాషలో చెప్పాలంటే… పడుకున్న గాడిదను లేపి తన్నించుకున్నట్లుగా ఉంది ప్రస్తుత కూటమి నేతల తీరు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసమే జరిగిందనేది టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఆరోపణ. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకున్నారు కాబట్టే… 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదు. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మళ్లీ గాడిలో పడిందనే మాట ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళ్తోంది.

Also Read: వర్మకు పోలీసుల ప్రశ్నలు.. చెవిరెడ్డి సమాధానాలు..!

ఆగిన అమరావతి, పోలవరం పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. అదే సమయంలో ఇతర ప్రాజెక్టులు కూడా పట్టాలెక్కుతాయనేది ప్రజల నమ్మకం. ఇలాంటి సమయంలో ర్యాంకుల పేరుతో మంత్రుల తీరును ప్రకటిస్తూ ఓ జాబితాను విడుదల చేయడమే విమర్శలకు తావిస్తోంది. ఇంకా చెప్పాలంటే… ఈ ర్యాంకుల వల్ల కూటమిలో విభేదాలున్నాయనే మాటకు అగ్నికి ఆజ్యం పోసినటైంది. వాస్తవానికి ఏ మంత్రి ఏ స్థాయిలో పని చేస్తున్నారనేది ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే. గతంలో మంత్రుల పనితీరు కేవలం పత్రికల ద్వారా మాత్రమే తెలిసేది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి నేత పనితీరు కార్యకర్తతో పాటు సామాన్యులకు కూడా తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ర్యాంకులు అవసరమే లేదు. కానీ ర్యాంకింగ్‌ అంటూ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన జాబితా చూస్తే మాత్రం… ఎదురు కూలి ఇచ్చి మరి తన్నించుకున్నట్లుగా ఉంది.

Also Read: షర్మిలను దెబ్బ కొట్టడమే లక్ష్యమా…? 

మంత్రిగా లోకేష్ పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్న మాట వాస్తవం. అయితే ఒకటో ర్యాంక్‌ ఇస్తే… సీఎం కుమారుడు కాబట్టి ఇచ్చారనే మాట వస్తుంది. అదే లోకేష్‌కు చివరి ర్యాంక్ ఇస్తే… పనితీరు బాలేదనే విమర్శలు వెల్లువెత్తుతాయి. దీంతో 8వ ర్యాంకు ఇవ్వడంతో.. పని చేయడం ఇంకా రాలేదా అనే మాట వస్తోంది. ఇక సీఎం చంద్రబాబు 6వ స్థానంలో ఉన్నారంటే పనితీరులో వెనుకబడ్డారా అనే మాట వస్తుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు సీఎంగా వ్యవహరించిన సీనియర్‌ నేత… ఇప్పుడు ఫైళ్ల క్లియరెన్స్‌, ప్రభుత్వ పనితీరుపై కొత్తగా నేర్చుకోవాలా అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అసలు ఫైళ్ల కదలికను బట్టి మార్కులు ఎలా వేస్తారు.. ర్యాంకులు ఎలా ఇస్తారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. వాస్తవానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దగ్గర దాదాపు 6 శాఖలున్నాయి.

Also Read: ఒక్క టూర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్

వీటిల్లో కీలకమైన పంచాయతీ రాజ్ శాఖ, అటవీ శాఖలున్నాయి. వీటిపై నిత్యం సమీక్షలు చేస్తూనే ఉన్నారు పవన్. మరో విషయం ఏమిటంటే.. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్‌ను కూడా ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా చదివిన తర్వాతే దానిపై సంతకం చేస్తున్నారు పవన్. ఇక పవన్ సారధ్యంలోని పంచాయతీ రాజ్ శాఖ ఏ స్థాయిలో పనిచేస్తుందనేది బహిరంగ రహస్యమే. ఇప్పటికే పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఇక పంచాయతీలకు తన సొంత నిధులు కూడా పవన్ కేటాయించారు. గ్రామ సభల నిర్వహణ, పంచాయతీల అభివృద్ధి అనేది పవన్ పరిధిలోనివే. ఇవి సూపర్ సక్సెస్ అని ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. కానీ ర్యాంకింగ్‌లో మాత్రం పవన్‌కు 10వ స్థానం కేటాయించారు. ఇదే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.

Also Read: టీటీడీలో మొదలైన ప్రక్షాళన.. వారికి గుడ్ బై…!

ఏ మంత్రి ఏం చేస్తున్నారు… ఏ స్థాయిలో పని చేస్తున్నారు అనేది జనాలకు తెలుసంటున్నారు జనసేన నేతలు. పనితీరు బాగుండాలంటే… ఫైల్స్‌ పైన గుడ్డిగా సంతకాలు చేసుకుంటూ పోవాలా అనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. అలా ముందు వెనుక చూసుకోకుండా సంతకాలు పెడితే… తర్వాత వచ్చే ఇబ్బందులు తెలియవా… అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు, బులుగు మీడియా కూటమి ఏ తప్పు చేస్తుందా అని భూతద్దం వేసి మరీ వెతుకుతున్నాయి. ఆచి తూచి వ్యవహరించాల్సిన ఇలాంటి సమయంలో ఇలా ర్యాంకులంటూ ఓ లిస్ట్‌ బయటపెట్టి వైసీపీకి ఎందుకు అవకాశం ఇస్తున్నారని పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఏదైనా తప్పులుంటే.. అంతర్గత సమావేశంలో చెప్పి సరిపెట్టకుండా… ఇలా బహిరంగం చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. పాతకాలపు విధానాలకు ఇప్పటికైనా స్వస్తి పలకాలని సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్