Saturday, September 13, 2025 03:11 AM
Saturday, September 13, 2025 03:11 AM
roots

బోరుగడ్డ దెబ్బకు జీవితం నాశనం చేసుకున్న మరో ఖాకీ

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలకు, ఆ పార్టీ మద్దతుదారులకు సహకరించే పోలీసులలో ఇంకా మార్పు రావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా బోరుగడ్డ అనీల్ కుమార్ విషయంలో పోలీసుల వ్యవహారశైలి ప్రశ్నార్ధకంగా మారింది. అనీల్ కు బిర్యాని పెట్టడం, పోలీస్ స్టేషన్ లోనే మంచం వేయడం వంటివి వివాదాస్పదం అయ్యాయి. అతని వద్దకు వెళ్లి పోలీసు అధికారులే సేవలు చేయడం పట్ల తీవ్ర విమర్శలు ఉన్నాయి. పైగా ఆ వీడియో బయటపెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం చాలా కామెడీగా మారింది.

Also Read : నార్త్ పైనే ఫోకస్… బాలీవుడ్ వెన్నులో వణుకు

ఈ తరుణంలో మరో న్యూస్ హాట్ టాపిక్ అయింది. రౌడీషీటర్, రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ పోలీస్ కస్టడీలో సరిగ్గా విచారించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన గుంటూరు పశ్చిమ డిఎస్పీ జయరాం ప్రసాద్ పై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి డీజీపీకి నివేదిక అందింది. కేసులో విచారణకు గత నెల 26 నుంచి 29 వరకు అనీల్ ను గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉంచారు పోలీసులు. మూడు రోజులపాటు అతడిని దగ్గరుండి విచారించాలని అప్పట్లో పశ్చిమ డీఎస్పీ జయరాం ప్రసాద్ కు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు.

Also Read : కొత్త పెన్షన్ల అర్హతలు… కావాల్సిన పత్రాలు ఇవే

అప్పుడప్పుడే విచారణలో పాల్గొన్నారని ఎస్పీ విచారణలో గుర్తించారు. అతడికి స్టేషన్ లో సిబ్బంది రాచమర్యాదలు చేసిన విషయాన్ని డీఎస్పీ గుర్తించకపోవడం పర్యవేక్షణ లోపం కిందకు వస్తుందని ఐజీకి నివేదక అందింది. ఈ నివేదిక ఆధారంగా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తీవ్ర చర్యలకు సిఫార్సు చేసారు. ఇది అమలు చేస్తే పదోన్నతులతో పాటు ఇంక్రిమెంట్ తదితర ఆర్థిక ప్రయోజనాల్లో కోత పడనుంది. బోరుగడ్డ వ్యవహారంలో ఇప్పటి దాకా 12 మందిపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికైనా పోలీసుల వ్యవహారశైలిలో మార్పు వస్తుందో రాదో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్