ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా కి ప్రత్యేక స్థానం ఉంది. నాయకురాలుగా కంటే చేసే వ్యాఖ్యలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు రోజా. రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు విమర్శలపైనే ఆమె ఎక్కువగా ఆధారపడ్డారు. లేదంటే నమ్మిన నాయకుడికి భజన చేయడంలో రోజా ఫేమస్ అయ్యారు అనేది కూడా ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం రోజా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మూడోసారి ఓడిపోయారు.
Also Read : తమిళనాడు పై పవన్ గురి..?
వైసీపీలో కూడా ఆమెకు మంచి ప్రాధాన్యత దక్కింది. అయితే గత పది రోజుల నుంచి రోజా ఏ విధంగా కూడా మీడియా ముందుకు రాలేకపోతున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా విమర్శలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు రోజా. వైయస్ జగన్ పై అలాగే వైసిపి పాలనపై తీవ్ర విమర్శలు టిడిపి నాయకులు చేస్తున్న సరే రోజా మాత్రం మాట్లాడటం లేదు. ఇదే సమయంలో పార్టీ నాయకత్వానికి కూడా ఆమె దూరంగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. నగిరి నియోజకవర్గంలో కార్యకర్తలతో కూడా ఈ మధ్యకాలంలో రోజా పెద్దగా మాట్లాడటం లేదు.
Also Read :ఏదైనా బావిలో దూకి చావండి..!
కీలక నాయకులను గతంలో పదేపదే కలిసే రోజా.. ఈసారి మాత్రం భయపడుతున్నట్టుగానే కనబడుతోంది. ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు అనిమిని రవి నాయుడు.. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కార్యక్రమాల్లో రోజా పాత్ర పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి రోజా మాట వినపడటం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన పలు కార్యక్రమాల్లో రోజా అవినీతికి పాల్పడ్డారు అనేది ప్రధాన అనేది ప్రధాన ఆరోపణ. ఇక రోజా పార్టీ నాయకులకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఆమె సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఉంటే చెన్నైలో లేదంటే హైదరాబాదులో మాత్రమే రోజా ఎక్కువగా ఉంటున్నారు.