ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ప్రమాదానికి గల కారణాలపై ప్రాధమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసారు. ఈ నివేదికలో ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. విమానంలో ఇంధనం స్విచ్ లను ఆపెసినట్టు కాక్ పిట్ లో రికార్డ్ అయినట్టు తెలిపారు. ఓ పైలెట్ మరో పైలెట్ ను మీరు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసారు అని అడగగా తాను చేయలేదు అని సమాధానం ఇచ్చినట్టు నివేదికలో పేర్కొన్నారు.
Also Read : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..!
దీనిపై తాజాగా ఓ విమానాయాన రంగ నిపుణుడు సంచలన కామెంట్స్ చేసారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ప్రమాదం ప్రమాదం ఉద్దేశపూర్వకమై ఉండవచ్చని ప్రముఖ విమానయాన నిపుణుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్ అభిప్రాయపడ్డారు. ఇది ఆత్మాహుతి దాడిగా కూడా భావించవచ్చని జాతీయ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పైలట్లలో ఒకరు ఉద్దేశపూర్వకంగా ఇంధనాన్ని ఆపివేసి ఉండవచ్చు.. అలా చేస్తే ప్రమాదం జరుగుతుందని పైలెట్ కు తెలుసా అని అడగగా..? కెప్టెన్ రంగనాథన్ ఖచ్చితంగా అని ఆన్సర్ ఇచ్చారు.
Also Read : యువ టెన్నిస్ స్టార్ రాధిక హత్య పై అడవి శేష్ ఎమోషనల్ పోస్ట్
డ్రీమ్‌లైనర్ ఇంజిన్‌లకు ఇంధనాన్ని ఆపివేయడానికి ఏదైనా మార్గం ఉందా అని అడగగా.. ఇది మాన్యువల్ గా చేయాలన్నారు. పవర్ కు స్విచ్ లకు సంబంధం లేదని, వాటిని ఒక స్లాట్ లో రూపొందించారు అని, ఆ స్లాట్ బయటకు కనపడదు అన్నారు. ఓపెన్ చేస్తేనే కనపడుతుందని, చేయి తగిలి అలా జరగడానికి కూడా అవకాశం లేదని స్పష్టం చేసారు. స్లాట్ ఓపెన్ చేసి మాత్రమే వాటిని ఆఫ్ చేయాలన్నారు.