Tuesday, October 28, 2025 04:13 AM
Tuesday, October 28, 2025 04:13 AM
roots

జమిలి ఎన్నికల పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

ఎప్పటి నుంచో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతుంది.జమిలి ఎన్నికలపై కేంద్ర అధికార పార్టీ బిజెపి ఆసక్తిగా ఉండడంతో, దీనికి సంబంధించిన విషయాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ప్రక్రియ మొదలైంది.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈనెల 18న మొదలు కాబోతోంది.దీని తరువాత మహారాష్ట్ర , ఝార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్ర అధికార పార్టీ బిజెపి కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Read Also : వివేకా కేసు విషయంలో జగన్ చేసిన పెద్ద తప్పు ఇదే

ఈ ఐదేళ్ల కాలంలోనే వన్ నేషన్ , వన్ ఎలక్షన్ నిర్వహించ తలపెట్టింది. గతంలో ఈ జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు సాధ్యసాధ్యనాలపై అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ , లోక్ సభ కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలంటూ కేంద్రం ఆదేశాలను జారీచేసినట్లు ఉన్నత స్థాయి అధికారులు పేర్కొంటున్నాయి .తాజాగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని నిర్ధారించారు. ప్రస్తుత మోది ప్రభుత్వ హయాంలోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ న నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ విషయంపై స్పందించడంతో, త్వరలోనే దానికి సంబంధించి ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి వందరోజులు పూర్తయిన నేపథ్యంలో , మీడియాతో అమిత్ షా అన్ని విషయాల పైన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వ హాయంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు అమిత్ షా చెప్పారు .వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సారధ్యంలో ఏర్పాటు అయిన కమిటీ తన తుది నివేదికను అందజేస్తుందని అమిత్ షా పేర్కొన్నారు .

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్