Tuesday, October 28, 2025 01:42 AM
Tuesday, October 28, 2025 01:42 AM
roots

బన్నీ ఎఫెక్ట్.. టాలీవుడ్‌లో కొత్త భయం..!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కొత్త భయం మొదలైంది. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వల్ల. టాలీవుడ్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే మెగాస్టార్ కుటుంబానికి బంధువులు కావడంతో ఏ చిన్న విషయమైనా సరే… అంతా ఏకమైపోతారు. ఇప్పుడు ఇదే ఐక్యత కొంప ముంచేలా మారిందే అని టాలీవుడ్ ప్రముఖులు భయపడుతున్నారు. టాప్ హీరోలు మొదలు… బడా నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు, సాంకేతిక నిపుణులు అంతా నిన్నటి వరకు అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా… పదేళ్ల చిన్నారి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read: నేను సీఎం గా ఉండగా మీ ఆటలు సాగవు.. టాలీవుడ్ కు రేవంత్ స్ట్రోక్

ఈ వ్యవహారంలోనే అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఒకరాత్రి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా గడిపిన అల్లు అర్జున్‌ను టాలీవుడ్ ప్రముఖులంతా పరామర్శించారు. అయ్యో అలా ఎలా జరిగింది అంటూ కుశల ప్రశ్నలు వేశారు. తోటి వారికి ప్రమాదం జరిగితేనో, వారి కుటుంబ సభ్యులు కాలం చేస్తేనో పరామర్శించడం సర్వ సాధారణం. అయితే బన్నీ విషయంలో రెండూ కాదు. జస్ట్ ఓ రాత్రి జైలులో గడిపి వచ్చాడని సినీ పరిశ్రమ మొత్తం అయ్యో బన్నీ… ఏమైంది నీకు.. అంటూ తెల్లారి నుంచే క్యూ కట్టారు. బన్నీని పరామర్శించిన రోజే టాలీవుడ్‌ ఇండస్ట్రీపై విమర్శలు వెల్లువెత్తాయి.

Tollywood Meets Allu Arjun
Tollywood Celebrities Visits Allu Arjun

మృతి చెందిన మహిళ కుటుంబాన్ని ఇప్పటి వరకు పరిశ్రమ తరఫున ఒక్కరు కూడా పరామర్శించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఒక్కరు కూడా విచారించలేదు. పైగా తొక్కిసలాటకు హీరోకు సంబంధం ఏమిటన్నట్లుగా కొందరు కామెంట్లు కూడా చేశారు. ఇదే విషయంపై టాలీవుడ్ ప్రముఖుల పై సాధారణ ప్రేక్షకులు కూడా విమర్శలు చేశారు. ఇదేం మానవత్వం మీది అని దుయ్యబట్టారు. ఇప్పుడు ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. హీరోకు ఏమైనా కాలు విరిగిందా.. కన్ను పోయిందా.. అంతా కట్టగట్టుకుని పరామర్శించారు.. మరి ప్రాణాలు పోయిన మహిళకు విలువ లేదా.. బాలుడిది కుటుంబం కాదా అని నిలదీశారు. దీంతో టాలీవుడ్‌లో భయం మొదలైందనే మాట వినిపిస్తోంది.

Also Read: సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయి-అల్లు అర్జున్

వాస్తవానికి పుష్ప 2 ప్రభావం టాలీవుడ్‌పైన బలంగానే పడింది. తొక్కిసలాట కారణంగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షో అనుమతి ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీని వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని ఇప్పటికే నిర్మాతలు భయపడుతున్నారు. ఇక బన్నీ పరామర్శ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నారనే విషయం కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది. మెగా ఫ్యామిలీ తప్ప ప్రతి ఒక్కరు బన్నీని పరామర్శించారు. సొంత కుటుంబ సభ్యులే దూరంగా ఉంటే… మనకెందుకు వచ్చిన తలనొప్పి ఇది అని అంతా గుసగుసలాడుతున్నారు.

Also Read: తెలుగుదేశం.. పడిలేచిన కెరటం..!

చిరంజీవి, నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి కలిశారు తప్ప… వాళ్లే వచ్చి పరామర్శించలేదు. ఇక పవన్ కల్యాణ అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించలేదు కూడా. అలాంటప్పుడు మనం తొందరపడ్డామా అని సినీ ప్రముఖులు మదనపడుతున్నారు. రాబోయే రోజుల్లో టాలీవుడ్ తరఫున సీఎం రేవంత్‌రెడ్డిని కలిస్తే.. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పగలమా అని కూడా భయపడుతున్నారు. ఈ విషయంపై అల్లు కుటుంబానికి దూరంగా ఉండటమే ప్రస్తుతానికి ఉత్తమం అని మరికొందరు టాలివుడ్ ప్రముఖులు భావిస్తున్ననట్లు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప 2 సినిమా… కలెక్షన్ల వర్షంతో పాటు టాలీవుడ్‌లో భయాన్ని కూడా రేకెత్తించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్