Friday, September 12, 2025 01:36 PM
Friday, September 12, 2025 01:36 PM
roots

మెగా ఫ్యాన్స్ ను కెలికిన అల్లు మామ..!

మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఉంది అనే విషయం చాలామంది క్లారిటీ వచ్చింది. దాదాపు రెండు, మూడు ఏళ్ల నుంచి వీళ్లిద్దరి మధ్య వివాదం చినుకు చినుకు గాలివానగా మారుతుంది. అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటకు రావాలి అనుకోవడం.. మెగా ఫాన్స్ తో పాటుగా ఆ ఫ్యామిలీ హీరోలకు కూడా నచ్చడం లేదు. పుష్ప సినిమా ఆ రేంజ్ లో హిట్ అవుతుందని మెగా ఫ్యామిలీ ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఈ విషయంలో అల్లు అరవింద్, చిరంజీవి సమస్యను పరిష్కరిస్తారని చాలామంది ఎదురు చూశారు.

Also Read: నెట్ ఫ్లిక్స్ లో పుష్ప సరికొత్త రికార్డులు

కానీ చిరంజీవి సైలెంట్ గా ఉన్నా… అల్లు అరవింద్ మాత్రం సైలెంట్ గా ఉండటానికి ఇష్టపడటం లేదు. పెద్దరికం ప్రదర్శించాల్సిన అల్లు అరవింద్… మీడియా ముందు లేనిపోని కాంట్రవర్సీలకు ఊతమిస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఫస్ట్ సినిమా చిరుతపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాంచరణ్ డెబ్యూ మూవీ చిరుత యావరేజ్ సినిమా అని.. ఆ తర్వాత మగధీర సినిమాతో పెద్ద హిట్ ఇచ్చానంటూ అల్లు అరవింద్ ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు.

Also Read: రామ్ కోసం బాలయ్య.. ఫేట్ మారుతుందా..?

అయితే వాస్తవానికి ఆ సినిమా యావరేజ్ కాదు అనే టాక్ ఉంది. 2007లో రిలీజ్ అయిన చిరుత సినిమా… 9 కోట్లు బడ్జెట్ తో వచ్చి ఏకంగా అప్పట్లో 25.23 కోట్ల షేర్ రాబట్టింది. ఇక స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు పరిచయమైన సినిమాలకు ఆ రేంజ్ కలెక్షన్స్ రాలేదు. వాళ్ళ ఫస్ట్ సినిమాలు దాదాపుగా ఫ్లాప్ అయ్యాయి. వాళ్లతో పోలిస్తే రామ్ చరణ్ నటించిన చిరుత సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. 2007లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో 8వ హైయెస్ట్ గ్రాసర్ గా సినిమా రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన చాలా సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ కూడా జరిగింది. అయితే ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడు వివాదం రాజేయడంతో మండిపడుతున్నారు మెగా ఫాన్స్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్