Tuesday, October 28, 2025 05:07 AM
Tuesday, October 28, 2025 05:07 AM
roots

వైఎస్ ఫ్యామిలీ సేవలో కూటమి సర్కార్..

వైసీపీ అధికారం కోల్పోయిన సరే కొంతమందికి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది. వైసీపీ నేతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుత అధికారులు అలాగే పాలకులు చూస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. తాజాగా వైసీపీ అధినేత జగన్ కు వరసకు సోదరుడైన పులివెందులకు చెందిన వైఎస్ వెంకటరెడ్డికి సంక్రాంతి పండుగ సమయంలో లీజు రూపంలో భారీ కానుక ఇచ్చింది రాష్ట్ర గనుల శాఖ. వైఎస్ఆర్ జిల్లా వేములలో దాదాపు 100 కోట్లకు పైగా విలువ చేసే ముగ్గు రాయి నిలువల లీజును రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది.

Also Read : ఏపీలో వైసీపీ ఉందా.. లేదా..?

సెలవు రోజుల్లో… ఈ నెల 15న కనుమ పండుగనాడు లీజు కేటాయిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు విడుదల చేయడం సంచలనం అయింది. ఈ ఫైల్ ఆగమేఘాలపై కదలడానికి వైఎస్ఆర్ జిల్లాకు చెందిన టిడిపి ముఖ్యనేత ఒకరి సహకారం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వేములలో సర్వే నెంబర్లు 10, 21/26, 43 లో 11.6 సెక్టార్లలో ముగ్గురాయి కోసం వైఎస్ వెంకటరెడ్డి 2016లో దరఖాస్తు చేసుకోగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫైల్ వేగంగా ముందుకు వెళ్ళింది. 9.5 హెక్టార్లలో ముగ్గురాయి లీజులకు ఘనల శాఖ ఎర్రగుంట్ల సబ్ రిజిస్టర్ 2020 మార్చ్ లో ప్రతిపాదన పంపారు.

Also Read : ఎన్టీఆర్‌ను రెచ్చగొడుతున్న వైసీపీ..!

గనుల శాఖ అప్పటి సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించి లీజు మంజూరు చేశారు. వైయస్ కుటుంబానికి ప్రస్తుత ప్రభుత్వంలో ఇంత వేగంగా పండుగ రోజు ఫైల్ కదలడంపై టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారు. పండుగ సెలవుల్లో ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఏంటని, ఆ శాఖ మంత్రిని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా ఫైల్ ముందుకు వెళ్లే అవకాశం లేదని… అధికారం కోసం కార్యకర్తలను మోసం చేయొద్దంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్