నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమా అనగానే ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అఖండ తర్వాత నుంచి బాలయ్య రేంజ్ పెరిగిపోయింది. అప్పటివరకు బాలయ్యను కామెంట్ చేసిన వారు కూడా ఆ తర్వాత నుంచి ఆయన సినిమా వస్తే థియేటర్ కు పరుగులు పెడుతున్నారు. ఇతర సీనియర్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా కష్టంగా ఉన్న సమయంలో, బాలయ్య ఒకటి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య చేతిలో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ మూడు సినిమాల తర్వాత మరో సినిమా కూడా స్టోరీ విన్నారు.
Also Read : ఎన్టీఆర్ వారసులపై అనుచిత వ్యాఖ్యలు..!
ఇక డిసెంబర్ లో అఖండ సీక్వెల్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు బాలకృష్ణ. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాను దసరా నుంచి మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడిన సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరాకు సినిమా మొదలుపెట్టి సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
Also Read : కేటీఆర్ కు రేవంత్ బిగ్ షాక్.. ఆ కేసు కూడా సీబీఐ చేతికి..?
పక్కా మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తీసుకురానున్నాడు గోపీచంద్ మలినేని. అయితే ఇది ఫ్యాక్షన్ కథ కాదని మరో స్టోరీ అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బాలయ్య చిన్న కుమార్తె కథలో కొన్ని మార్పులు చెప్పడంతో కాస్త ఆలస్యమైందని.. లేదంటే వినాయక చవితి నుంచి సినిమా మొదలయ్యేది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇక ఈ సినిమా తర్వాత జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో కూడా బాలయ్య ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది. దీనిపై కూడా ఇప్పటికే కథ రెడీ చేసి పెట్టుకున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ కు వెళ్లే అవకాశాలు ఉండొచ్చు.