Friday, September 12, 2025 08:42 PM
Friday, September 12, 2025 08:42 PM
roots

స్టార్ హీరోయిన్ ను నిండా ముంచిన పర్సనల్ అసిస్టెంట్

సాధారణంగా నకిలీ బిల్లులు ప్రభుత్వ వ్యవస్థలో మనం వింటూనే ఉంటాం. కాని లేటెస్ట్ గా నకిలీ బిల్లులతో ఓ హీరోయిన్ ను మోసం చేసాడు ఓ వ్యక్తి. అసలు ఏంటీ ఆ స్టోరీ అనేది ఒకసారి చూద్దాం. ఆలియా భట్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ ను పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రూ.77 లక్షలకు మోసం చేసినందుకు గాను పోలీసులు అరెస్టు చేశారు. అలియా భట్ నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.76.9 లక్షల అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.

Also Read : శంకర్ కు సాధ్యంకాని విజయం శేఖర్ కు ఎలా సాధ్యమైంది?

దీనితో 32 ఏళ్ల వేదికా ప్రకాష్ శెట్టి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం మే 2022 మరియు ఆగస్టు 2024 మధ్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. అలియా భట్ తల్లి, నటి-దర్శకురాలు సోనీ రజ్దాన్ జనవరి 23న జుహు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత, నమ్మక ద్రోహం, మోసం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఆ తర్వాత పోలీసులు వేదికా శెట్టి కోసం గాలించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, వేదికా శెట్టి 2021 నుండి 2024 వరకు అలియా భట్ కు వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసింది.

Also Read : బావా, బామ్మర్దులుగా బాలయ్య, వెంకటేష్..!

ఆ సమయంలో అలియా భట్ ఆర్ధిక వ్యవహారాలను చూసింది. ఆమెకు సంబంధించిన బిల్లులను కూడా చెల్లించింది. ఇక అలియా భట్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసింది ఆమెనే. వేదికా శెట్టి నకిలీ బిల్లులు తయారు చేసి.. అలియాతో సంతకం చేయించి, డబ్బును స్వాహా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసు వర్గాలు తెలిపాయి. తన ప్రయాణం, మీటింగ్స్, ఇతర సంబంధిత ఏర్పాట్ల ఖర్చుల గురించి వేదికాకు అలియా చెప్పేదని.. అలా అవకాశాన్ని వాడుకుని మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. చివరికి, జుహు పోలీసులు ఆమెను బెంగళూరులో అరెస్టు చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్